మహిళా మంత్రులను.. ఆత్మీయంగా పలకరించిన కేసీఆర్
గోల్డెన్ న్యూస్/ హైదరాబాద్ /మేడారం సమ్మక్క-సారలమ్మ జాతరకు రావాలని కోరుతూ మంత్రులు సీతక్క, కొండా సురేఖ మాజీ సీఎం కేసీఆర్ను గురువారం ఎర్రవెల్లి నివాసంలో కలిశారు. ప్రభుత్వం తరపున అధికారిక ఆహ్వాన పత్రికతో పాటు అమ్మవార్ల ప్రసాదాన్ని అందజేశారు.
ఈ సందర్భంగా కేసీఆర్, శోభమ్మ దంపతులు మంత్రులను ఎంతో ఆత్మీయంగా ఆహ్వానించి.. ఇంటికి వచ్చిన ఆడబిడ్డలకు అతిధి మర్యాదలతో, పసుపు కుంకుమలు చీరలు, తాంబూలాలతో సంప్రదాయబద్ధంగా సత్కరించారు. రాజకీయాలకు అతీతంగా సాగిన ఈ భేటీలో మేడారం అభివృద్ధి పనులపై చర్చించారు. దాదాపు రూ. 200 కోట్లతో జాతర పరిసరాలను తీర్చిదిద్దినట్లు మంత్రులు తెలిపారు. మరికొద్ది రోజుల్లో, మేడారం సమ్మక్క సారలమ్మ జాతర ప్రారంభం కానున్న మహా జాతరకు తాము తప్పకుండా రావడానికి ప్రయత్నిస్తామని కేసీఆర్ సానుకూలంగా స్పందించారు.









