మేడారానికి పోటెత్తిన భక్తజనం

గోల్డెన్ న్యూస్/ తాడ్వాయి/ఆసియా ఖండంలోనే అతిపెద్ద గిరిజనజాతరగా పేరుగాంచిన మేడారం జాతరకు జనం పోటెత్తారు. స్కూళ్లకు సెలవులు ఇవ్వడంతో గ్రామాల బాట పట్టిన జనం పనిలో పనిగా మేడారం వనదేవతలను దర్శించుకుంటున్నారు. వనదేవతలను దర్శించుకోవడానికి లక్షలాదిగా భక్తజనం తరలి వస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలోని ములుగు జిల్లా మేడారం మహా జాతర కోసం భక్తులు వేలాదిగా తరలివస్తున్నారు. సమ్మక్క, సారలమ్మ గద్దెల ప్రాంగణం కిక్కిరిసిపోయింది.ఆసియా ఖండంలోనే అతిపెద్ద గిరిజనజాతరగా పేరుగాంచిన మేడారం జాతరకు జనం పోటెత్తారు. స్కూళ్లకు సెలవులు ఇవ్వడంతో గ్రామాల బాట పట్టిన జనం పనిలో పనిగా మేడారం వనదేవతలను దర్శించుకుంటున్నారు. దేశ వ్యాప్తంగా సమ్మక్క-సారలమ్మ వనదేవతలను దర్శించుకోవడానికి లక్షల మంది భక్తజనం తరలి వస్తున్నారు. సంక్రాంతి పండుగ సెలవులు ప్రారంభం కావడంతో మేడారం సమ్మక్క-సారలమ్మ మహా జాతరకు భక్తులు ముందుగానే తరలివెళ్తున్నారు. దీంతో మేడారంలోని గద్దెల ప్రాంగణంతోపాటు జంపన్న వాగు పరిసరాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. నిజానికి జనవరి 28 నుంచి 31 వరకూ మహాజాతర కొనసాగనుంది. కానీ, అప్పటికి విపరీతమైన రద్దీతో పాటు ప్రస్తుతం సెలవులు కూడా ఉండటంతో వనదేవతలకు ముందస్తు మొక్కులు చెల్లించుకుంటున్నారు భక్తులు. ములుగు గట్టమ్మ తల్లి ఆలయం వద్ద భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. జాగారం నుంచి మేడారం వరకు, కన్నెపల్లి, జంపన్నవాగు, హరిత హోటల్ వరకు వాహనాల రద్దీతో రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. పార్కింగ్ కోసం వాహనాలను పొలాల్లోకి మళ్లిస్తున్నారు.

Recent News :

MOHAMMED RAFEE

MOHAMMED RAFEE

GOLDEN NEWS EDITOR & CHAIRMAN

Admin

Golden News

Facebook
WhatsApp
Twitter
Telegram