గోల్డెన్ న్యూస్ / కరకగూడెం / తహసీల్దార్ కార్యాలయంలో చైన్ మ్యాన్ గా పనిచేసే రాజమల్ల బుచ్చిరాములు(55) సోమవారం తన పొలంలో నీటిలో పడి మృతి చెందాడు. ఎప్పటిలాగే సోమవారం బుచ్చిరాములు తన పొలం వద్దకు వెళ్లివస్తానని చెప్పి వెళ్లిన మనిషి ఎంతసేపటికీ రాకపోవడంతో కుటుంబ సభ్యులు పొలం వద్దకు వెళ్లి చూడగ నీటిలో జీవచ్ఛవంలా పడి ఉన్నాడు. కుటుంబ సభ్యులు వెంటనే హాస్పిటల్ కి తరలించగా పరీక్షించిన వైద్యులు మృతి చెందినట్లు నిర్ధారించారు .విషయం తెలుసుకున్న తసిల్దార్ వట్టం కాంతారావు, ఆర్ఐ పోలెబోయిన కృష్ణ ప్రసాద్ ప్రభుత్వం నుంచి అందాల్సిన తక్షణ సాయం రూ.30 వేలు మృతుడి కుటుంబ సభ్యులకు అందజేశారు.
Post Views: 45









