గోల్డెన్ న్యూస్ /తెలంగాణ / ఇంటర్ వార్షిక పరీక్షలకు ఐదు నిమిషాలు ఆలస్యంగా వచ్చే విద్యార్థులను అనుమతించాలని ఇంటర్‌బోర్డు నిర్ణయించింది. ఈ నిబంధన గత ఏడాది కూడా అమలులో ఉంది. ఫిబ్రవరి 25 నుంచి మార్చి 18 వరకు ఇంటర్ వార్షిక (థియరీ) పరీక్షలు జరగనున్నాయి. 9 లక్షలకు పైగా విద్యార్థులు పరీక్ష ఫీజు చెల్లించారు. ఇంగ్లిష్ ప్రాక్టికల్స్ ఈ నెల 21, 22 తేదీల్లో, ఎథిక్స్ అండ్ హ్యూమన్ వ్యాల్యూస్ 23న, ఎన్విరాన్‌మెంటల్ ఎడ్యుకేషన్ 24న నిర్వహించనున్నారు. ఆ తర్వాత ఫిబ్రవరి 2 నుంచి 21 వరకు ప్రాక్టికల్ పరీక్షలు జరగనున్నాయి.
Post Views: 41









