బంతి పువ్వుల తోటలో గంజాయి మొక్కలు పెంచుతున్న పూజారి 

గోల్డెన్ న్యూస్ / సంగారెడ్డి / ఒక పూజారి. నిత్యం భగవంతుడిని ఆరాధించే వ్యక్తి. మంచినే పాటిస్తూ చెడును త్యజించాల్సిన వ్యక్తి. మంచిచెడుల వ్యత్యాసాలను నలుగురికి వివరించి చెప్పాల్సిన బాధ్యత కలిగిన వ్యక్తి. కానీ ఆయనే తప్పుపని చేశాడు.

ఏకంగా బంతిపూల వనంలో గంజాయి మొక్కులు పెంచాడు. విషయం తెలుసుకున్న పోలీసులు ఆ బంతిపూల వనంపై రైడ్‌ చేసి పట్టుకున్నారు.

సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ మండలంలోని పంచగం గ్రామంలో దేవాలయ ప్రాంగణంలో ఏకంగా బంతిపూల వనంలో గంజాయి మొక్కులు పెంచాడు. విషయం తెలుసుకున్న పోలీసులు ఆ బంతిపూల వనంపై దాడి చేసి పట్టుకున్నారు.

 

పూజారిని అరెస్ట్ చేసి రూ.70 లక్షల విలువైన గంజాయిని స్వాధీనం చేసుకున్న పోలీసులు

Facebook
WhatsApp
Twitter
Telegram