– 4 లేబర్ కోడ్ లు రద్దు చేయాలి
-ఉపాధి హామీ, విద్యుత్ , విత్తన చట్టాన్ని పరిరక్షించాలి
– సిఐటియు
గోల్డెన్ న్యూస్ / కరకగూడెం / దేశంలో లేబర్ కోడ్ లు అమలు కార్మిక హక్కులకు మరణ శాసనం లాంటివాని వాటిని ప్రతిఘటించాలని సిఐటియు మండల కన్వీనర్ కొమరం కాంతారావు పిలుపునిచ్చారు ఫిబ్రవరి 12న జరిగే దేశవ్యాప్త సమ్మెను పాల్గొని విజయవంతం చేయాలని ఈ సందర్భంగా వారు కార్మిక వర్గానికి విజ్ఞప్తి చేశారు పలు రంగాల్లో సమ్మెకు సంబంధించిన నోటీసులు ఇచ్చారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కార్మికుల శ్రమను తీవ్రస్థాయిలో దోపిడీ చేయడం, సంపద మొత్తాన్ని కార్పోరేట్ శక్తులకు దోచిపెట్టడం, నయా బానిస వ్యవస్థను తయారు చేయడం లక్ష్యంగా లేబర్ కోడ్లు రూపొందించబడ్డాయని వారు విమర్శించారు వందల సంవత్సరాల పోరాటాల ఫలితంగా కార్మిక హక్కులు సాధించుకున్నామని వాటిని మోదీ కేంద్ర బీజేపీ ప్రభుత్వం, పెట్టుబడిదారులు, కార్పొరేట్ల ప్రయోజనాల కోసం రద్దు చేస్తున్నాయని విమర్శించారు సంపద సృష్టిలో పౌర సేవలు సృష్టిలో కార్మికులు రైతులు వ్యవసాయ కార్మికులే కీలకపాత్ర పోషిస్తున్నారని అటువంటి సంపద సృష్టికర్తల హక్కుల పైన ఏకపక్షమైన దాడి కేంద్ర బిజెపి ప్రభుత్వం చేస్తుందని వారి విమర్శించారు ఉపాధి హామీ చట్టాన్ని నిర్వీర్యం చేసేలా చేస్తుందని నూతన విద్యుత్ చట్టం విత్తన చట్టం బడా కార్పొరేట్ పెట్టుబడిదారుల కోసమే చట్టాలను నీరుగారుస్తుందని వారు ఆవేదన వ్యక్తం చేశారు ఫిబ్రవరి 12 ఒకరోజు సమ్మె తోటి కేంద్ర ప్రభుత్వం వైఖరిలో మార్పు రాకపోతే బహుళ రోజుల సమ్మెలకు కార్మిక వర్గాన్ని సమాయత్వం చేస్తామని వారు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో మండలంలోని అంగన్వాడి, మధ్యాహ్న భోజనం, గ్రామపంచాయతీ రంగాల కార్మికులు నాయకులు పాల్గొన్నారు.









