ఆత్మలకు ఓట్లు : ఓటర్ జాబితాలో మృతి చెందిన వారి పేర్లు

మృతి చెందిన వారి పేర్లు ఓటరు జాబితాలో తొలగించని అధికారులు

తెలంగాణ రాష్ట్రంలోని  మొయినాబాద్ లోనీ  25వ వార్డులో ఎస్ నరసింహ గౌడ్ అయిదేళ్ల క్రితం చనిపోయారు. ఇప్పటికీ ఆయన ఓటు తొలగించ లేదు.. అదే  వార్డులోని శ్రీశైలం మరో వ్యక్తి మృతి చెంది మూడేళ్లు అవుతోంది. ఓటరు జాబితాలో పేరు కొనసాగుతోంది. మొయినాబాద్ పురపాలిక పరిధిలో 26 వార్డులు ఉండగా.. 32 వేల మందికిపైగా ఓటర్లు ఉన్నారు. ఇందులో 2,500కు పైగా చనిపోయిన వారి ఓట్లు ఉన్నాయని అంచనా. డివిజన్ పరిధిలోని చేవెళ్ల, శంకర్పల్లి పురపాలికల పరిధిలోనూ పరిస్థితి ఉన్నట్లు తెలుస్తోంది. ఈ రెండు పురపాలికల్లోనూ సుమారు 4 వేల మందికి పైగా చనిపోయిన వారి పేర్లు ఓటరు జాబితాల్లో ఉన్నాయని అంచనా. మృతుల పేర్లను తొలగించడానికి నిబంధనలు కఠినంగా ఉండటంతో సమస్యలు ఉత్పన్నమవుతున్నాయని వెల్లడించిన అధికారులు.

Facebook
WhatsApp
Twitter
Telegram