ట్రాక్టర్‌ బోల్తా.. నలుగురు కూలీలు మృతి

ట్రాక్టర్‌ బోల్తా.. నలుగురు కూలీలు మృతి

 

గోల్డెన్ న్యూస్ /మల్లాపూర్ / జగిత్యాల జిల్లాలో మంగళవారం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఓ ట్రాక్టర్‌ అదుపు తప్పి బోల్తా పడగా అందులో ప్రయాణిస్తున్న నలుగురు వ్యవసాయ కూలీలు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో ఎనిమిది మంది గాయపడ్డారు. మృతుల్లో ఒకరు 13 ఏళ్ల బాలిక కాగా మిగిలిన ముగ్గురు మహిళలు. స్థానికుల కథనం ప్రకారం.. జగిత్యాల జిల్లా మల్లాపూర్‌ మండలంలోని మొగిలిపేటకు చెందిన ఎర్రంశెట్టి గంగాధర్‌ అనే రైతు తమ గ్రామానికి చెందిన 10 మంది మహిళలు, ఇద్దరు విద్యార్ధినిలను తోటలో పసుపు తీయడానికి మంగళవారం ఉదయం తన ట్రాక్టర్‌లో తీసుకెళ్లాడు. పని ముగించుకుని సాయంత్రం వారంతా అదే ట్రాక్టర్‌లో ఇంటికి తిరిగి వస్తుండగా  తిరిగివస్తుండగా ట్రాక్టర్‌ అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో పలువురు కూలీలకు గాయాలు అయ్యాయి. వారిని ఆసుపత్రికి తరలించారు. పోలీసులు సహాయ చర్యలు చేపట్టారు.

Facebook
WhatsApp
Twitter
Telegram