మేడారం హుండీల లెక్కింపు ప్రారంభం
గోల్డెన్ న్యూస్ / తాడ్వాయి / ములుగు జిల్లా తాడవాయి మండలం మేడారం సమ్మక్క – సారలమ్మ జాతర హుండీల లెక్కింపు హనుమకొండలోని టీటీడీ కళ్యాణ మండపంలో గురువారం ప్రారంభమైంది. హుండీల లెక్కింపును దేవదాయ శాఖ మంత్రి కొండా సురేఖ ప్రారంభించారు. హుండీల లెక్కింపు వద్ద అధికారులు తగిన ఏర్పాట్లు చేశారు. నిరంతరం సీసీ కెమెరా పర్యవేక్షణలో హుండీల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతుందని అధికారులు తెలిపారు. గతంలో కంటే ఈసారి రికార్డ్ స్థాయిలో 788 హుండీలు ఏర్పాటు చేశారు.
Post Views: 28









