ఎన్నికలు ఫలితాలు..
మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది. ముందుగా పోస్టల్ బ్యాలెట్లను ఎన్నికల అధికారులు లెక్కిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లలో ఫిబ్రవరి 11వ తేదీన పోలింగ్ నిర్వహించారు. ఇందుకు సంబంధించి రాష్ట్ర ఎన్నికల సంఘం కౌంటింగ్ కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ప్రత్యేక పాసులు ఉన్నవారినే మాత్రమే కౌంటింగ్ కేంద్రాల్లోకి అనుమతించారు. భారీ భద్రత నడుమ లెక్కింపు చేపట్టారు.
కాంగ్రెస్ పార్టీ విజయం సాధించిన ప్రాంతాలు:
సుల్తానాబాద్ (పెద్దపల్లి జిల్లా)
మంథని (పెద్దపల్లి జిల్లా)
చొప్పదండి (కరీంనగర్ జిల్లా)
మరిపెడ (మహబూబాబాద్ జిల్లా)
డోర్నకల్ (మహబూబాబాద్ జిల్లా)
అశ్వారావుపేట (భద్రాద్రి కొత్తగూడెం జిల్లా)
ఇల్లెందు (భద్రాద్రి కొత్తగూడెం జిల్లా)
బిచ్కుంద (కామారెడ్డి జిల్లా)
బీఆర్‌ఎస్ పార్టీ విజయం సాధించిన ప్రాంతాలు:
అయిజ (గద్వాల జిల్లా)
తిరుమలగిరి (సూర్యాపేట జిల్లా)
ఇంద్రేశం (సంగారెడ్డి జిల్లా)
ఇంకా పలు మున్సిపాలిటీలలో ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. పూర్తి ఫలితాలు వెలువడిన తర్వాత రాజకీయ సమీకరణాలు స్పష్టమయ్యే అవకాశం ఉంది.









