గోల్డెన్ న్యూస్ /కరకగూడెం / పినపాక శాసనసభ్యులు పాయం వెంకటేశ్వర్లు మంగళవారం మండలంలో పర్యటించనున్నారు. ఉదయం 10 గంటలకు కరకగూడెం మండలంలోని బట్టుపల్లి రైతు వేదికలో కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమం కలదు. ఈ కార్యక్రమంలో పినపాక శాసనసభ్యులు పాయం వెంకటేశ్వర్లు ముఖ్యఅతిథిగా పాల్గొని లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేయనున్నట్లు తాసిల్దార్ కార్యాలయం నుండి ఒక ప్రకటన వెలువడింది. కావున మండల స్థాయి అధికారులు, ప్రింట్ & ఎలెక్ట్రానిక్ మీడియా వారు అందరూ సకాలంలో హాజరుకావాలని తెలిపారు.
Post Views: 297









