విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్లను ప్రారంభించిన ఎమ్మెల్యే పాయం

– గ్రామాల విద్యుత్ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపుతాం 

 – నూతన విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్లను ప్రారంభించిన ఎమ్మెల్యే  పాయం వెంకటేశ్వర్లు

 

గోల్డెన్ న్యూస్ /కారకగూడెం/ గ్రామాల్లో తరచుగా ఎదురవుతున్న లో వోల్టేజ్ సమస్యలు మరియు విద్యుత్ అంతరాయాలను నివారించేందుకు ఈ ట్రాన్స్‌ఫార్మర్లు ఎంతో ఉపయోగపడనున్నాయని ఆయన అన్నారు.

 

వట్టం వారి గుంపు గ్రామపంచాయతీ పరిధిలోని ఎస్సీ కాలనీలో రూ. 3 లక్షల వ్యయంతో ఏర్పాటు చేసిన ట్రాన్స్‌ఫార్మర్‌ను ప్రారంభించారు.

 

చిరుమల్ల గ్రామపంచాయతీ పరిధిలోని పోల్కమ్మతోగు గ్రామంలో రూ. 3 లక్షల వ్యయంతో ఏర్పాటు చేసిన ట్రాన్స్‌ఫార్మర్‌ను ప్రారంభించారు.

 

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంతాల్లో స్థిరమైన విద్యుత్ సరఫరా వ్యవసాయం, గృహ వినియోగం మరియు చిన్న వ్యాపారాల అభివృద్ధికి కీలకమని పేర్కొన్నారు. ప్రజలకు మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు.

 

ఈ కార్యక్రమంలో ఎలక్ట్రికల్ ఏఈ నరహరి రాజశేఖర్, ఎమ్మార్వో కాంతయ్య, ఎంపీడీవో కుమార్ మండల అధ్యక్షులు సయ్యద్ ఇక్బాల్ హుస్సేన్ , సర్పంచ్‌లు  తోలెం రమాదేవి, పోలేబోయిన సుజాత, కొమరం సుగుణ, చౌలం కేశవరావు, తోలెం రమేష్,చొప్పాల తోలెం సావిత్రి, ఎల్లబోయిన ముత్తమ్మ , పొట్టయ్య,, రెవెన్యూ అధికారులు, పంచాయతీ అధికారులు, ఉప సర్పంచ్‌లు, వార్డ్ మెంబర్లు, పోలేబోయిన శ్రీవాణి, తిరుపతయ్య, మాజీ ప్రజా ప్రతినిధులు, మండల కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, మహిళలు, గ్రామస్తులు, అభిమానులు, యువకులు తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Facebook
WhatsApp
Twitter
Telegram