అనంతారం పాఠశాలలో “బాలా మేళా”

గోల్డెన్ న్యూస్ / కరకగూడెం  / విద్యార్థుల ప్రాథమిక భాషా గణిత అభ్యాస నైపుణ్యాలను పెంపొందించుటకు మరియు వారిలో సృజనాత్మకత, ఆత్మవిశ్వాసాన్ని అభివృద్ధి చేయుట లక్ష్యంగా అనంతారం కాంప్లెక్స్ స్థాయి “బాలా మేళా” కార్యక్రమం విజయవంతంగా నిర్వహించారు.

 

ఈ కార్యక్రమంలో మండలంలోని వివిధ ప్రాథమిక పాఠశాలల నుండి 1వ తరగతి నుండి 5వ తరగతి వరకు విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. విద్యార్థుల కోసం ప్రాథమిక అంశాలపై రాత పరీక్షలు, కథలు చెప్పడం, చదవడం, గణిత నైపుణ్యాల ప్రదర్శన వంటి విద్యా మరియు సృజనాత్మక కార్యక్రమాలు నిర్వహించబడినవి.

 

కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఇన్చార్జి ప్రధానోపాధ్యాయులు సిహెచ్ వసంత్ గారు మాట్లాడుతూ, బాలా మేళా వంటి కార్యక్రమాలు విద్యార్థుల్లో నేర్చుకునే ఆసక్తిని పెంపొందించడంతో పాటు వారి ప్రతిభను వెలికితీసే మంచి వేదికగా నిలుస్తాయని తెలిపారు. విద్యార్థులు ఆత్మవిశ్వాసంతో పాల్గొని తమ ప్రతిభను చాటుకోవడం అభినందనీయమని అన్నారు.

 

మండల విద్యాధికారి జి మంజుల కార్యక్రమ నిర్వహణలో ఉపాధ్యాయులు మరియు ప్రధానోపాధ్యాయులు చూపిన కృషిని ప్రశంసించారు.విద్యార్థుల అభ్యాస ఫలితాలను మెరుగుపరచడంలో ఇటువంటి కార్యక్రమాలు కీలక పాత్ర పోషిస్తాయని పేర్కొన్నారు.

 

పోటీలలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బహుమతులు మరియు ప్రశంసా పత్రాలు అందజేయబడినవి. కార్యక్రమంలో ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు మరియు స్థానిక ప్రజలు పాల్గొని విద్యార్థులను ప్రోత్సహించారు.

 

ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన అన్ని పాఠశాలల ఉపాధ్యాయులు, నిర్వాహకులకు విద్యాశాఖ అధికారులు అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల రిసోర్స్ పర్సన్స్ జె.వెంకటేశ్వర్లు, భావ్ సింగ్, ఆట యూనియన్ మండల అధ్యక్షులు కుమారస్వామి యుటిఎఫ్ మండలాధ్యక్షులు కోట్ల సూర్యనారాయణ .

ఉపాధ్యాయులు నారాయణ రామస్వామి సర్వేశ్వరరావు వినోద్ వసంత శకుంతల సుప్రియ ఉమ సి ఆర్ పి విష్ణు తదితరులు పాల్గొన్నారు.

Recent News :

MOHAMMED RAFEE

MOHAMMED RAFEE

GOLDEN NEWS EDITOR & CHAIRMAN

Admin

Golden News

Facebook
WhatsApp
Twitter
Telegram