కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయంలో విద్యార్థిని ఆత్మహత్యాయత్నం

కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయంలో విద్యార్థిని ఆత్మహత్యాయత్నం : సీనియర్ల ర్యాగింగ్ ఆరోపణలు

గోల్డెన్ న్యూస్ /మహబూబాబాద్ / గూడూరు మండలం బ్రాహ్మణపల్లి గ్రామంలోని కస్తూర్బా గాంధీ గురుకుల బాలికల పాఠశాలలో ఆదివారం ఉదయం షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. 8వ తరగతి విద్యార్థిని సీనియర్ల ర్యాగింగ్ కారణంగా మనస్తాపానికి గురై, 16 ఐరన్ మాత్రలు మింగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది.

 

బొల్లెపల్లి గ్రామానికి చెందిన ఈ విద్యార్థిని పాఠశాల సిబ్బంది త్వరగా గమనించి, సమీప ఆరోగ్య కేంద్రానికి తరలించారు. మెరుగైన చికిత్స కోసం మహబూబాబాద్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి రిఫర్ చేశారు. ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలో ఆమెకు చికిత్స కొనసాగుతోంది.

 

ర్యాగింగ్ ఆరోపణలపై పాఠశాల యాజమాన్యం అంతర్గత విచారణ చేపట్టింది. తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తుండగా, స్థానికులు విద్యార్థుల భద్రత, మానసిక ఆరోగ్యంపై మరింత శ్రద్ధ వేయాలని కోరుతున్నారు.

 

ఈ సంఘటన విద్యాసంస్థల్లో ర్యాగింగ్ నియంత్రణ, కౌన్సెలింగ్ వ్యవస్థల అవసరాన్ని మరోసారి హైలైట్ చేసింది.

Facebook
WhatsApp
Twitter
Telegram