CPM కేంద్ర కమిటీ సభ్యుడు తమ్మినేని వీరభద్రం పై అభిశంసన

CPM కేంద్ర కమిటీ సంచలన నిర్ణయం

CPM కేంద్ర కమిటీ సభ్యుడు తమ్మినేని వీరభద్రం పై అభిశంసన

ఆయనతోపాటు రాష్ట్ర కమిటీ సభ్యులు స్కైలాబ్ బాబు, ప్రసాద్ లపై అభిశంసన

CPM ప్రధాన కార్యదర్శి..MA బేబీ పేరుతో CPM రాష్ట్ర కమి

 

గోల్డెన్ న్యూస్ / హైదరాబాద్ /తెలంగాణలో సిపిఎం పార్టీ ప్రతిష్ట మసకబారడం, ఎన్నికల్లో వరుసగా ఘోర పరాజయాలు, అగ్రనేతలపై వస్తున్న అవినీతి ఆరోపణలను సీపీఎం కేంద్ర నాయకత్వం తీవ్రంగా పరిగణించింది. పార్టీ నియమావళికి విరుద్ధంగా వ్యవహరించడం, ఏకపక్ష నిర్ణయాలతో పార్టీని దెబ్బతీయడం వంటి అంశాలపై దృష్టి సారించి.. రాష్ట్రానికి చెందిన ముగ్గురు నేతలపై క్రమశిక్షణ చర్యలకు ఉపక్రమించింది. మాజీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, రాష్ట్ర కమిటీ సభ్యులు స్కైలాబ్ బాబు, ప్రసాద్పై అభిశంసన తీర్మానం ప్రవేశపెట్టారు..

 

గత ఏడాది జనవరిలో సంగారెడ్డిలో CPM నిర్వహించిన మహాసభల్లో చోటు చేసుకున్న పరిణామాలపై ద్విసభ్య కమిటీ నివేదిక ఆధారంగా .. ఈ నిర్ణయం తీసుకుంది. గత ఏడాది కొత్త రాష్ట్ర కార్యదర్శిగా జాన్ వెస్లీ ని ఎన్నుకునే సమయంలో లాబీయింగ్, ప్రలోభాలు, అస్తిత్తవాదం చోటుచేసుకున్నాయని తెలిపింది కేంద్ర కమిటీ (రాజకీయ కక్షలను కులతత్వం ప్రభావితం చేసిందని ఆక్షేపించింది) బూర్జవ పద్ధతులను అనుసరించడాన్ని ఆ ముగ్గురు వెనకాడ లేదని పార్టీ విమర్శించింది. పార్టీ ప్రయోజనాల కన్నా ముఠా  ప్రయోజనాలు పైకి తీసుకురావడానికి ఉద్దేశపూర్వకంగా ప్రయత్నం జరిగిందని   తప్పు పట్టింది పార్టీ హైకమాండ్. ఈ పరిణామాలపై 2017లో రాష్ట్ర పార్టీని హెచ్చరించామని ఈ లేఖలో పార్టీ ప్రధాన కార్యదర్శి వెల్లడించారు కార్యదర్శి ఎన్నికల్లో ముఠాతత్వం ఆందోళనకర స్థాయికి చేరిందని గుర్తించినట్లు ఆయన వివరించారు

తెలంగాణలో CPM చీలిక వాదం వాతావరణం గుర్తించి ఐక్యత కోసం ప్రయత్నించిన ఫలితం లేదన్న CPM ప్రధాన కార్యదర్శి లేఖలు తెలిపారు ఇకపై పార్టీ సభ్యులంతా పార్టీ లైన్ ప్రకారమే నడుచుకోవాలని లేఖ ద్వారా ఆదేశాలు జారీ చేశారు

 

Facebook
WhatsApp
Twitter
Telegram