వెంకటేశ్వర్లు హత్య కేసులో పురోగతి

 హత్య కేసులో 5గురు నిందితుల అరెస్ట్ 

గోల్డెన్ న్యూస్ / కరకగూడెం / గత నెల 28న కరకగూడెం  మండలం అశ్వాపురంపాడు గ్రామంలో కోవాసి వెంకటేశ్వర్లు హత్య  కేసులో పోలీసులు పురోగతి సాధించారు. హత్య కేసులో నిందితులను గురువారం పోలీసులు అరెస్టు చేశారు. అశ్వాపురంపాడు కు చెందిన 1) వజ్జ భీమరాజు 2 )మడివి మంగయ్య ,3). మడివి నందయ్య, దమ్మపేట మండలానికి చెందిన 4) వంకా బాలాజీ , బూర్గంపాడు మండలనికి చెందిన ,5) మడకం లక్ష్మయ్య,ను అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు. హత్యకు గురి అయిన కొవ్వాసి వెంకటేశ్వర్లు వీరికి కి మద్య గత కొంత కాలముగా ఊరిలో గొడవలు జరుగుతున్నాయి  ఈ రోజున (గురువారం) పై ఐదుగురు వ్యక్తులను అరెస్టు చేసి అ ఐదుగురు వద్ద నుండి  హత్యకు వాడిన గొడ్డలిని అతనిని చంపినప్పుడు రక్తపు మరకలు అంటిన బట్టలను మరియు బాలాజీ లక్ష్మయ్య అశ్వాపురం పాడు రావటానికి ఉపయోగించిన మోటార్ సైకిల్ ను స్వాధీనం చేసుకొని.  నిందితులను రిమాండ్కు తరలించినట్లు ఏడూళ్ళ బయ్యారం సీఐ వెంకటేశ్వరరావు మీడియాాకు వెల్లడించారు. ఈ కార్యక్రములో స్థానిక ఎస్ ఎస్ఐ పివిఎన్ రావు, ఏడూళ్ళ బయ్యారం ఎస్సై సురేష్  సిబ్బంధి  పాల్గొన్నారు

 

 

Facebook
WhatsApp
Twitter
Telegram