మాజీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అరెస్టు

గోల్డెన్ న్యూస్ /వెబ్ డెస్క్ / తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అరెస్ట్ అయ్యారు. ఖమ్మం జిల్లా వెలుగుమట్లలో బాధితులతో కలిసి నిరసన చేస్తున్న ఆమెను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఖమ్మం జిల్లా వెలుగుమట్ల బాధితులకు మద్దతుగా కవిత నిరాహారదీక్ష చేపట్టిన విషయం తెలిసిందే. దీంతో కవితతో పాటు నిరాహారదీక్ష చేపట్టిన వారిని పోలీసులు తాజాగా అరెస్టు చేశారు. వారిని ఖమ్మం నుంచి హైదరాబాద్‌ తరలించడంతో సమాచారం. అరెస్టు చేసినా దీక్ష కొనసాగిస్తానని కవిత స్పష్టం చేశారు. బాధితులకు న్యాయం జరిగే వరకు దీక్ష కొనసాగుతుందని తెలిపారు.

Facebook
WhatsApp
Twitter
Telegram