చిరుమళ్ళ ఆశ్రమ పాఠశాలలో కంటి వైద్య శిబిరం

గిరిజన ఆశ్రమ పాఠశాల చిర్రమల్ల నందు కంటి వైద్య శిబిరం

 

గోల్డెన్ న్యూస్ / కనకగూడెం /వందరోజుల హెల్త్ మిషన్ కార్యక్రమంలో భాగంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ తరఫున ఈ రోజున చిర్రమళ్ళ గిరిజన ఆశ్రమ పాఠశాల యందు ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించబడినది. ఈ వైద్య శిబిరంలో 130 మందికి కంటి వైద్య పరీక్షలు మరియు సాధారణ వైద్య పరీక్షలు నిర్వహించడం జరిగినది. హార్ట్ స్ట్రోక్ వచ్చినవారికి సిపిఆర్ గురించి వివరంగా పిల్లలకు నేర్పించడం జరిగినది. ఎండాకాలం కాబట్టి పిల్లలు వడదెబ్బకి Catch అయినప్పుడు వారు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి కూడా ఈ వైద్య శిబిరంలో చెప్పడం జరిగినది. విద్యార్థులకి సైట్ రాకుండా వారు ఏమేమి ఆహారం తీసుకోవాలి, ఎలాంటి ఎక్సర్సైజులు చేయాలి అనే దాని గురించి మణుగూరు ఏరియా హాస్పిటల్ ఆప్తాల్మిక్ ఆఫీసర్ జి సంజీవరావు తెలియజేయడం జరిగినది. సిపిఆర్ వడదెబ్బ గురించి ఆర్బిఎస్కే మెడికల్ ఆఫీసర్ డాక్టర్ తరుణ్ వివరించడం జరిగినది. మీ వైద్య శిబిరాన్ని ఇన్చార్జి హెడ్మాస్టర్ ఈ బాలరాజు గారు నిర్వహించడం జరిగినది ఈ వైద్య శిబిరాన్ని కరకగూడెం ఎస్సై పివిఎన్ రావు సందర్శించడం జరిగినది. ఈ వైద్య శిబిరంలో ఆర్ బి ఎస్ కే ఫార్మసిస్ట్ సరస్వతి, ఏఎన్ఎం పుష్ప,వెంకటేశ్వర్లు పాల్గొనడం జరిగినది.

Recent News :

MOHAMMED RAFEE

MOHAMMED RAFEE

GOLDEN NEWS EDITOR & CHAIRMAN

Admin

Golden News

Facebook
WhatsApp
Twitter
Telegram