పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఆదివాసీలకు వైద్య శిబిరం.

గొత్తికోయలకు వైద్య పరీక్షలు, మందుల పంపిణీ, యువతకు వాలీబాల్ కిట్లు ,విద్యార్థులకు స్కూల్ బ్యాగుల అందజేత.

గోల్డెన్ న్యూస్ / కరకగూడెం /భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పోలీసు శాఖ ఆధ్వర్యంలో కరకగూడెం మండలం పద్మాపురం పంచాయతీలోని నీలాద్రి పేట ఆదివాసి గ్రామంలో మణుగూరు డిఎస్పి రవీందర్ రెడ్డి, ఏడూళ్ల  బయ్యారం , సీఐ వెంకటేశ్వరరావు, కరకగూడెం ఎస్సై పివిఎన్ రావు నేతృత్వంలో నిర్వహించిన మెగా వైద్య శిబిరం విజయవంతమైంది. వివిధ వ్యాధులతో బాధపడుతున్న  గొత్తికోయ గుంపుల నుంచి ఆదివాసీలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఈ శిబిరానికి ముఖ్య అతిథిగా భద్రాద్రి జిల్లా ఎస్పీ రోహిత్ రాజు, ఓ ఎస్ డి నరేందర్ హాజరై సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అన్నింటి కన్నా మనుషుల ఆరోగ్యమే మహాభాగ్యమన్నారు. ఆరోగ్యం మెగా వైద్య శిబిరం నిర్వహించినట్లు చెప్పారు. ప్రజల ఆరోగ్యం పట్ల పోలీసు శాఖ ప్రత్యేక శ్రద్ధ వహిస్తుందన్నారు. శిబిరానికి హాజరైన వారికి వైద్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. అలాగే గొత్తికోయలకు సోలార్ లైట్లు ఏర్పాటు చేశారు , నిత్యవసర వస్తువులు, దుస్తులు, చిన్నారులకు స్కూల్ బ్యాగులు , యువతకు ఆల్వాల్కిట్లు, పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ రోహిత్ రాజ్ మాట్లాడుతూ యువత చెడు వ్యసనాలకు బానిస కాకుండా విద్యపై దృష్టి పెట్టాలని సూచించారు. తల్లిదండ్రులు పిల్లలను చిన్న వయసులోనే పనులకు తీసుకెళ్లకుండా తప్పనిసరిగా పాఠశాలకు పంపించాలని, వారి భవిష్యత్తు కోసం విద్య ఎంతోముఖ్యమని తెలిపారు. గ్రామాల్లో బాల్య వివాహాలు జరగకుండా తల్లిదండ్రులు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. అలాగే పరిసరాల పరిశుభ్రత, వ్యక్తిగత పరిశుభ్రత పాటించడం ద్వారా ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని అన్నారు. గ్రామంలో ఎవరైనాఅనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని తెలిపారు. గ్రామంలో ఎవరూ మద్యానికి బానిసై గొడవలకు దిగకుండా శాంతి భద్రతలను కాపాడాలని సూచించారు. గ్రామానికి రోడ్డు సదుపాయం కల్పించే విషయమై జిల్లా ఉన్నత అధికారులతో చర్చించి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.ఈ శిబిరానికి మణుగూరు ప్రైవేటు ఆస్పత్రి సూపర్డెంట్ సురేందర్, కరకగూడెం పిహెచ్ సి వైద్యాధికారి డాక్టర్ రవితేజ , మణుగూరులోని ప్రముఖ ప్రైవేట్ వైద్యులు డాక్టర్ శశిధర్, డాక్టర్ జయశ్రీ, డాక్టర్ బాలకృష్ణ హాజరయ్యారు. వైద్య శిబిరం విజయవంతం కావడానికి కృషి చేసిన వారికి  అభినందనలు తెలిపారు. కార్యక్రమంలో స్థానిక పోలీస్ సిబ్బంది , మధ్యాహ్నం చసక సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Recent News :

MOHAMMED RAFEE

MOHAMMED RAFEE

GOLDEN NEWS EDITOR & CHAIRMAN

Admin

Golden News

Facebook
WhatsApp
Twitter
Telegram