రాజ్యాధికార పార్టీ లో చేరికలు

గోల్డెన్ న్యూస్ / సిద్దిపేట / జిల్లాలో  కీలక రాజకీయ  పరిణామాలు చోటుచేసుకున్నాయి. చిన్నకోడూరు మండలం నుంచి వివిధ పార్టీలకు చెందిన పలువురు నాయకులు, కార్యకర్తలు తెలంగాణ రాజ్యాధికార పార్టీలో చేరడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ చేరికలతో అగ్రవర్ణ పార్టీలకు గట్టి ఎదురుదెబ్బ తగిలినట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

 

తెలంగాణ రాజ్యాధికార పార్టీ అధినేత, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న సమక్షంలో జరిగిన కార్యక్రమంలో చేరికలు జరిగాయి. పార్టీలో చేరిన వారికి ఆయన కండువా కప్పి ఆహ్వానించారు.

 

ఈ సందర్భంగా మల్లన్న మాట్లాడుతూ, బీసీ రాజ్యాధికారమే లక్ష్యంగా పార్టీ ముందుకు సాగుతోందని తెలిపారు. ప్రతి కార్యకర్త నిబద్ధతతో పనిచేస్తూ పార్టీ బలోపేతానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. ప్రజల సమస్యల పరిష్కారానికి తెలంగాణ రాజ్యాధికార పార్టీ కట్టుబడి ఉందని అన్నారు.

 

ఈ కార్యక్రమంలో యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షులు బొడ్డుపల్లి చంద్రశేఖర్, జిల్లా ఉపాధ్యక్షులు పి. నర్సింగ్, జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ గడ్డం వెంకటేష్, చిన్నకోడూరు మండల పదాన కార్యదర్శి గొటిపరి శీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

Facebook
WhatsApp
Twitter
Telegram