ఆయన లేని లోటు గ్రామానికి తీవ్ర నష్టం
ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ ఐక్యంగా ముందుకు సాగాలి
గోల్డెన్ న్యూస్/కరకగూడెం/ ప్రజా సమస్యలపై పోరాటాలు నిర్వహించడమే కోవాసి వెంకటేశ్వర్లకి ఇచ్చే ఘనమైన నివాళి అని సిపిఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యులు నిమ్మల వెంకన్న, గద్దల శ్రీనివాసరావు లు అన్నారు బుధవారం సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో అశ్వాపురం గ్రామంలో కోవాసి వెంకటేశ్వర్లు మృతికి సంతాప సూచికగా వర్ధంతి సభ నిర్వహించారు వర్ధంతి సభలో పార్టీ పతాకాన్ని ఆదివాసి గిరిజన సంఘం రాష్ట్ర నాయకులు మడివి రమేష్ ఆవిష్కరించారు అనంతరం సంతాప సభ మండల కార్యదర్శి కొమరం కాంతారావు అధ్యక్షతన జరిగినది ఈ సభలో వక్తలు మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కారం కోసం రాజీలేని పోరాటాలు నిర్వహిస్తూ గ్రామాన్ని నిలబెట్టుకోవడంలో వెంకటేష్ ది ప్రధమ స్థానమని ఆనాడు అనేక నిర్బంధాలను ఎదుర్కొని పోడు భూములు, ఇళ్ల స్థలాలు నిలబెట్టుకున్నారని స్థిర జీవనం ఏర్పాటు చేసుకొని బతుకుతున్నారని వారన్నారు రేషన్ కార్డులు, పింఛన్లు, కుల సర్టిఫికెట్ల కోసం రాజీలేని పోరాటాలు నిర్వహించారని వారన్నారు ఆయన ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ పూనుకోవాలని ఈ సందర్భంగా వారు పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో పినపాక మండల కార్యదర్శి దుబ్బ గోవర్ధన్ ఉమ్మడి మండలాల నాయకులు కల్తి వెంకటేశ్వర్లు, మడివి జోగయ్య, పదం బాబురావు, పద్దం గణేష్, పోడియం మంగయ్య, కనితి రాము, మడివి జోగయ్య, సిఐటియు నాయకులు దడిగెల సత్యనారాయణ, ఎస్ఎఫ్ఐ నాయకులు మాదాసు అఖిల్ తదితరులు పాల్గొన్నారు









