గోల్డెన్ న్యూస్/ కరకగూడెం /ముస్లింల పవిత్ర పండగ రంజాన్ ను పురస్కరించుకుని కరకగూడెం మండల కేంద్రంలో పేద ముస్లిం కుటుంబాలకు తాసిల్దార్ కార్యాలయంలో, తాసిల్దార్ కాంతయ్య, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు సయ్యద్ ఇక్బాల్ హుస్సేన్ బుధవారం ఈద్ క తోఫాను పంపిణీ చేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పవిత్ర రంజాన్ మాసంలో పాటించే ఉపవాస దీక్షలు ఎంతో భక్తి శ్రద్ధలతో పాటిస్తారని, అల్లా ఆశీస్సులు ఎల్లప్పుడూ అందరికీ ఉండాలని కోరారు. ఈ పవిత్రమైన రంజాన్ మాసంలో చిన్నపిల్లల నుంచి మొదలుకుని వృద్ధుల వరకు కఠోర నియమాలతో ఉపవాస దీక్షలు చేయడం గొప్ప విషయం అన్నారు. రంజాన్ మాసంలో మత సామరస్యానికి ప్రతీక, మత సామరస్య భావం పెంపొంది ప్రజల మధ్య ఐక్యత పెరుగుతుందన్నారు.
Post Views: 308









