ఆశా వర్కర్లకు18వేలు ఫిక్స్డ్ వేతనం ఇవ్వాలి

హామీలు అమలు చేయమంటే అరెస్టులు చేస్తారా

బూర్గంపాడు లో సిఐటియు ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించిన ఆశ వర్కర్లు

 

గోల్డెన్ న్యూస్ /బూర్గంపాడు / రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీ ప్రకారం ఆశా వర్కర్లకు 18 వేతనం ఇవ్వాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ఆశ వర్కర్లు ఆందోళన పోరాటాలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో మార్చి 28న హైదరాబాద్ కార్యక్రమాన్ని నిర్వహించగా ప్రభుత్వం తీవ్రమైన నిర్బంధాన్ని ప్రయోగించి వేలాది మంది ఆశా వర్కర్లను సిఐటియు నాయకులను అక్రమంగా అరెస్టు చేసింది ఈ అరెస్టులను ప్రభుత్వ నిర్బంధాన్ని నిరసిస్తూ తెలంగాణ ఆశా వర్కర్స్ యూనియన్ సిఐటియు రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు ఈరోజు బూర్గంపాడు మండల కేంద్రంలో ఆశా వర్కర్లు రాస్తారోకో నిర్వహించారు వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు బత్తుల వెంకటేశ్వర్లు మాట్లాడారు ప్రభుత్వం వెంటనే ఆశా వర్కర్ల న్యాయమైన డిమాండ్లు పరిష్కారం చేయాలని ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు అమలు చేయమంటే అక్రమ అరెస్టులు చేయటం అన్యాయమని పేర్కొన్నారు ఇచ్చిన హామీలు అమలు చేయనందుకు ఎన్నికల మేనిఫెస్టోకు విరుద్ధంగా ముఖ్యమంత్రి పాలన సాగిస్తున్నందుకు ముఖ్యమంత్రి మంత్రుల మీదనే పోలీసులు కేసులు నమోదు చేయాలని సిఐటియు డిమాండ్ చేసింది ఎంత నిర్బంధాన్ని ప్రయోగించిన పోరాటాన్ని కొనసాగిస్తామని సిఐటియు ఆశా వర్కర్ల యూనియన్ పేర్కొన్నది ఓట్ల కోసం అధికారం కోసం హామీలు ఇచ్చి ఇప్పుడు విస్మరిస్తారని నాయకులు ప్రశ్నించారు పోరాటం కొనసాగుతుందని ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయాలని స్పష్టం చేశారు ఈ రాస్తారోకో

కార్యక్రమంలో ఆశా వర్కర్ యూనియన్ సిఐటియు నాయకులు తార, నాగమణి, కృష్ణవేణి, పద్మ ,విజయ, శ్రీలత, వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు Sk అబిదా, బయ్యా రాము ,కెవిపిఎస్ రాయల వెంకటేశ్వర్లు, తదితరులు పాల్గొన్నారు

Facebook
WhatsApp
Twitter
Telegram