ఇందిరమ్మ ఇళ్లను ప్రారంభించిన ఎమ్మెల్యే

మండలంలో 408 ఇందిరమ్మ  ఇళ్లు మంజూరు చేసాం

 

గోల్డెన్ న్యూస్ / కరకగూడెం / పేదల సొంతింటి కల నెరవేర్చడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు అన్నారు. మంగళవారం కరకగూడెం  మండలం పర్యటించి వివిధ గ్రామాల్లో  నిర్మించిన ఇందిరమ్మ ఇళ్లను ఎమ్మెల్యే ప్రారంభించారు.  నూతనంగా నిర్మించిన ఇందిరమ్మ ఇళ్లకు గృహప్రవేశాలు చేయించిన అనంతరం, తహసిల్దార్ కార్యాలయంలో లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు. అనంతరం మాట్లాడుతూ.. కరకగూడెం మండలంలో 408 ఇళ్లు మంజూరు చేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో మండల ప్రత్యేకాధికారి దినేష్ కుమార్, ఎంపీడీవో వర కుమార్, ఇన్ఛార్జి తాసిల్దార్ కాంతయ్య, ఎంఈఓ మంజుల పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు స్థానిక అధికారులు పాల్గొన్నారు.

Recent News :

MOHAMMED RAFEE

MOHAMMED RAFEE

GOLDEN NEWS EDITOR & CHAIRMAN

Admin

Golden News

Facebook
WhatsApp
Twitter
Telegram