మరో నాలుగు రోజుల్లో ఆ ఇంట పెళ్లి బాజాలు మోగాలి.. పచ్చని పందిరి కింద కొత్త జీవితాన్ని ప్రారంభించాల్సిన యువతి. భావి వద్ద యువతి మృతదేహం..
గోల్డెన్ న్యూస్ / మరిపెడ / మరో నాలుగు రోజుల్లో ఆ ఇంట పెళ్లి బాజాలు మోగాలి.. పచ్చని పందిరి కింద కొత్త జీవితాన్ని ప్రారంభించాల్సిన యువతి. భావి వద్ద యువతి మృతదేహం లభ్యం. పెళ్లి జరగడానికి కేవలం నాలుగు రోజులు మాత్రమే మిగిలి ఉండగా, ఒ యువతి అనుమానాస్పద పరిస్థితుల్లో మృతి చెందడం స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది.
మరిపెడ మండలం గిరిపురం ఇటుకలగడ్డ తండాకు చెందిన భూక్యా సంగీత (19)కు, మరిపెడ మున్సిపాలిటీ కొత్త తండాకు చెందిన అజ్మీర అరవింద్‌తో ఈ నెల 29న వివాహం తెగల సమక్షంలో వివాహానికి ముహూర్తం ఫిక్స్ అయింది .గతంలో ఇద్దరూ ప్రేమించుకున్నప్పటికీ, యువతి తల్లిదండ్రులు తొలుత ఈ పెళ్లికి అంగీకరించలేదని గ్రామస్తులు తెలిపారు. ఆ సమయంలో ఆత్మహత్యాయత్నం చేసినట్లు సమాచారం.
తరువాత ఇరువురి కుటుంబ సభ్యులు మాట్లాడుకుని వీరి వివాహానికి అంగీకరించారు . అదే యువకుడితో నిశ్చితార్థం జరిగింది. పెళ్లి డేట్ కూడా ఫిక్స్ అయ్యింది. పెళ్లి ఏర్పాట్లు వేగంగా జరుగుతున్నాయి , ఇటీవల అబ్బాయి ఇంట్లో జరిగిన శుభకార్యానికి ఇరు కుటుంబ సభ్యులు హాజరైనట్లు తెలిసింది.
అయితే మంగళవారం రాత్రి సమయంలో సంగీత, అరవింద్ బైక్‌పై వెళ్లినట్లు తండా వాసులు చెబుతున్నారు. ఆ తర్వాత ఏమి జరిగిందో తెలియదు కానీ, బుధవారం తెల్లవారుజామున గ్రామ సమీపంలోని భావి వద్ద సంగీత మృతదేహం కనిపించడం గ్రామంలో విషాదం నెలకొంది. మృతదేహం సమీపంలో రక్తపు మరకలతో ఉన్న చెప్పులు కనిపించడంతో సంగీత మృతిపై అనుమానాలు రేకెత్తిస్తున్నాయి.
సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్ట్‌మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు..








