చెరువులో హెచ్చరిక బోర్డుల ఏర్పాటు

రేగులగండి చెరువు వద్ద హెచ్చరిక బోర్డుల ఏర్పాటు

 

గోల్డెన్ న్యూస్  / మణుగూరు /మండలంలోని కూనవరం పంచాయతీ పరిధిలో  రేగులగండి చెరువు వద్ద భారతి ఫౌండేషన్ ఆధ్వర్యంలో బుధవారం హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఫౌండేషన్ సభ్యులు మాట్లాడుతూ…  కొండల మధ్య ప్రకృతిలో చూసేందుకు సుందరంగా  ఉన్న ఈ చెరువు లోతును ఊహించక కొందరు మద్యం మత్తులో దిగి ప్రాణాల మీదికి తెచ్చుకుంటున్నారన్నారు. గడిచిన ఎనిమిది నెలల్లో ఇద్దరు మృతి చెంది వారి కుటుంబాలకు తీరని ఆవేదనను మిగిల్చారన్నారు. ఇలాంటి విషాదకర ఘటనలు ఏ కుటుంబానికి జరగరాదనే ఉద్దేశ్యంతో తమ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రమాదకరంగా ఉన్న చెరువు ముందు భాగంలో హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

Facebook
WhatsApp
Twitter
Telegram