ఆదిమా తెగలకు ప్రత్యేక మత రిలీజియన్ ఏర్పాటు చేయాలి:చందా లింగయ్య

దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఆదిమా తెగలకు ప్రత్యేక మత రిలీజియన్ ఏర్పాటు చేయాలి:చందా లింగయ్య దొర మాజీ ఎమ్మెల్యే, జెడ్పి చైర్మన్ ఖమ్మం.

 

గోల్డెన్ న్యూస్ /తాడ్వాయి / ఆదివారం ములుగు జిల్లా తాడ్వాయి మండలం శ్రీ సమ్మక్క సారలమ్మ సన్నిధి మేడారం లో జాతీయ ఆదివాసి రాజ్యంగా హక్కులు సంస్కృతి పరిరక్షణ సమన్వయ సమితి ఆధ్వర్యంలో మేధావులతో 13 మే 2026 రోజున సుందరయ్య విజ్ఞాన భవనం చిక్కడపల్లి హైదరాబాద్ లో జాతీయ ఆదివాసి రాజ్యాంగ హక్కులు సంస్కృతి పరిరక్షణ కొరకు సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. దీనిని కరపత్రమును సమ్మక్క సారలమ్మ సన్నిధిలో చందా లింగయ్య దొర గారి సమక్షంలో మరియు వివిధ తెగల సంఘాల సమక్షంలో ఆవిష్కరించడం జరిగింది. ముఖ్య అతిథులుగా చందా లింగయ్య దొర గారు మాట్లాడుతూ

భారతదేశవ్యాప్తంగా ఉన్న ఆదిమ తెగలు ఒక ప్రత్యేక మత సంస్కృతిని కలిగి ఉన్నాయి. విభిన్న కట్టుబాట్లు ఆచార వ్యవహారాలు కలిగి ఉన్నారు. ఇది హిందూ సంస్కృతికి వైవిధ్యమైనటువంటి విధానము. అందుకే ప్రస్తుతం జరిగే జనగనన సర్వేలలో మాకు ప్రత్యేకమైన మత రిలీజియన్ ఏర్పాటు చేయాలని దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఆదిమ తెగలు డిమాండ్ చేస్తున్నాయి. మా తెగలకు హిందూ సంస్కృతితో ఎలాంటి సంబంధం లేదు. మా యొక్క పూర్వీకులను కొలుచుకునేదే మా దేవత ఆరాధన. అందుకే మా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆదిమ తెగలకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక కాలం ఏర్పాటు చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాము. భారతదేశంలో ఆదిమా తెగలు సుమారుగా 12 లక్షలు నివసిస్తున్నారు. ఇప్పటివరకు వారికి ప్రత్యేక రిలీజియన్ ఏర్పాటు చెయ్యలేదు. ప్రస్తుతం జరిగే జనగణలలో మా తెగకు ప్రత్యేక రిలీజియన్ ఏర్పాటు చేయాలని మేము దేశవ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు చేయటానికి సిద్ధంగా ఉన్నామని హెచ్చరిస్తున్నాం. రాష్ట్రంలో ఆదివాసి తెగలు మాట్లాడే ఆదిమా భాషలను భారత రాజ్యాంగంలోని ఎనిమిదవ షెడ్యూల్లో చేర్చి రక్షణ కల్పించాలని డిమాండ్ చేస్తున్నాము. సాదా బైనా మా పేరుతో తెలంగాణ రాష్ట్రంలోని 18 లక్షల ఎకరాలకు ప్రక్షాళన చేస్తున్నారు. ఇందులో ఎనిమిదవ కాలంలో 5వ షెడ్యూల్ ప్రాంతంలో మినహాయింపు ఉన్నది. కానీ రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. అందుకే సాదా బైనామా పేరుతో ఐదవ షెడ్యూల్డ్ ప్రాంతంలో గిరిజనేతరులకు భూమిపై హక్కు కల్పించే విధానాన్ని మేము వ్యతిరేకిస్తున్నాము. దీనికి సంబంధించిన జీవో ఎంఎస్ నెంబర్ 76 ను వెంటనే రద్దు చేయాలని కోరుచున్నాము.

ఈ కార్యక్రమంలో పొడుగు శ్రీనాథ్ తెలంగాణ రాష్ట్ర కోఆర్డినేటర్, పాయం సత్యనారాయణ రాష్ట్ర కన్వీనర్, మడవి నర్సింగారావు తెలంగాణ రాష్ట్ర కన్వీనర్, వట్టం ఉపేందర్ తుడుందెబ్బ రాష్ట్ర అధ్యక్షులు, రమణాల లక్ష్మయ్య తుడుందెబ్బ జాతీయ కన్వీనర్, పొదెం కృష్ణ ప్రసాద్ తెలంగాణ రాష్ట్ర రిటైర్డ్ ఎంప్లాయిస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు, కుర్షింగ మొతిరామ్ ,గొప్ప వీరయ్య డోల్ దెబ్బ రాష్ట్ర అధ్యక్షుడు, వజ్జ నరసింహారావు గిరిజన అభ్యుదయ సంఘం రాష్ట్ర కోఆర్డినేటర్, వట్టం కన్నయ్య తుడుందెబ్బ రాష్ట్ర కార్యదర్శి, చింత కృష్ణ తుడుందెబ్బ రాష్ట్ర కార్యదర్శి, వర్ష శ్రీను తుడుందెబ్బ రాష్ట్ర కార్యదర్శి, చందా మహేష్ తుడుందెబ్బ జిల్లా అధ్యక్షులు, దుగ్గారపు వీరభద్రం తుడుందెబ్బ భద్రాద్రి జిల్లా అధ్యక్షులు, సమ్మక్క పూజారులు సిద్ధబోయిన సురేందర్, సిద్ధబోయిన స్వామి, చందా గణేష్,కొమరం శ్రీను గిరిజన అభ్యుదయ సంఘం జిల్లా కార్యదర్శి,తాటి నాగరాజు,ఆక తిరుమల రావు,చర్ప రవీందర్ తదితరులు పాల్గొన్నారు.

Recent News :

MOHAMMED RAFEE

MOHAMMED RAFEE

GOLDEN NEWS EDITOR & CHAIRMAN

Admin

Golden News

Facebook
WhatsApp
Twitter
Telegram