మంత్రి సీతక్క పరువు నష్టం దావా

గోల్డెన్ న్యూస్/ హైదరాబాద్ / అంగన్‌వాడీ మొబైల్ ఫోన్ల కొనుగోలుపై బీఆర్ఎస్ చేసిన ఆరోపణలను తప్పుడు ప్రచారంగా నిర్ధారిస్తూ హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టు సంచలన మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఏప్రిల్ 10న బీఆర్ఎస్ తన అధికారిక సోషల్ మీడియా ఖాతాల్లో పోస్టు చేసిన వివాదాస్పద ప్రచారాలను వెంటనే తొలగించాలని కోర్టు ఆదేశించింది.

 

టెండర్ నోటిఫికేషన్ నుంచి చెల్లింపుల వివరాల వరకు అన్ని పత్రాలను పరిశీలించిన న్యాయస్థానం.. రూ.30 కోట్ల అవినీతి జరిగిందన్న బీఆర్ఎస్ ఆరోపణల్లో ఎలాంటి ఆధారాలు లేవని స్పష్టం చేసింది. ప్రభుత్వం ఒక్కో మొబైల్ ఫోన్‌ను రూ.11,650 చొప్పున మొత్తం రూ.44.42 కోట్లతో కొనుగోలు చేయగా, రూ.8,499 విలువైన ఫోన్‌ను రూ.14,499కి కొనుగోలు చేశారంటూ బీఆర్ఎస్ తప్పుడు ప్రచారం చేసిందని కోర్టు పేర్కొంది.

 

మంత్రి సీతక్క ప్రతిష్ఠను దెబ్బతీసేందుకే ఈ ఆరోపణలు చేశారన్న వాదనతో కోర్టు ఏకీభవించింది. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌తో పాటు పార్టీ సోషల్ మీడియా విభాగంపై మంత్రి సీతక్క పరువు నష్టం దావా దాఖలు చేశారు.

 

ఈ కేసులో మంత్రి సీతక్క తరఫున అడ్వకేట్ నాగులూరి కృష్ణ కుమార్ వాదనలు వినిపించారు. అనంతరం బీఆర్ఎస్ పార్టీకి, కేసీఆర్‌కు కోర్టు గట్టి హెచ్చరికలతో కూడిన ఆదేశాలు జారీ చేసింది.

 

Facebook
WhatsApp
Twitter
Telegram