మద్యం మానేయమన్నందుకు యువకుడు ఆత్మహత్య

గోల్డెన్ న్యూస్ / బచ్చన్నపేట  / మండల పరిధిలోని బసిరెడ్డిపల్లి గ్రామంలో శనివారం విషాద ఘటన చోటుచేసుకుంది.మద్యం మానేసి జీవనోపాధి కోసం   పని చూసుకోవాలని కుటుంబ సభ్యులు మందలించడంతో  మనస్థాపానికి గురైన యువకుడు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఎస్సై శ్రీకాంత్ తెలిపిన వివరాల ప్రకారం. బసిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన బండకింది నర్సింహులు (25) కొంతకాలంగా మద్యానికి బానిసై వ్యవసాయ పనులకు వెళ్లకుండా ఇంట్లోనే ఉంటున్నట్లు కుటుంబ ఉంటున్నాడని. ఈ నేపథ్యంలో అతని తల్లిదండ్రులు మద్యం తాగడం మానేసి ఏదైనా పని చూసుకుంటేనే పెళ్లి చేస్తామని సూచించేవారని రాత్రి కుటుంబ సభ్యులతో కలిసి భోజనం చేసిన అనంతరం ఇంటి విద్యపై నిద్రించిన  నర్సింహులు, మనస్థాపానికి గురై తెల్లవారుజామున ఇంటి సమీపంలోని వ్యవసాయ బావి వద్ద ఉన్న వేపచెట్టుకు చీరతో ఉరివేసుకుని కనిపించాడు.ఉదయం పాలు పితికేందుకు వెళ్లిన తండ్రి గమనించి సమీప రైతులు వంగపెల్లి శేఖర్ రెడ్డి, ఏసు రెడ్డి సహాయంతో కిందికి దింపి చూడగా.. అప్పటికే మృతి చెందినట్లు గుర్తించారు. మృతుడి తల్లి అమ్మలమ్మ ఫిర్యాదు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై  తెలిపారు.

Facebook
WhatsApp
Twitter
Telegram