పొదుపు సంఘాల ద్వారా తీసుకున్న రుణాలను గ్రూప్ సభ్యులు సకాలంలో క్రమం తప్పకుండా చెల్లించాలని ఏపీఎం
గోల్డెన్ న్యూస్ / కరకగూడెం / మండల కేంద్రంలోని సెర్ఫ్ కార్యాలయంలో మహిళా స్వయం సహాయక సంఘాల కోసం నిర్వహించిన రెండు రోజుల శిక్షణ కార్యక్రమం గురువారంతో ముగిసింది. రాష్ట్ర స్థాయి రిసోర్స్ పర్సన్లు 27 గ్రామ సమాఖ్య ల పాలకవర్గ సభ్యులకు సంఘాల నిర్వహణపై అవగాహన కల్పించారు. కార్యక్రమం సందర్భంగా కరకగూడెం ఏపీఎం వినోద్ క్రాంతి పాల్గొని ఈ సందర్భంగా మాట్లాడారు. స్వయం సహాయక సంఘాల బలోపేతానికి ప్రతి ఒక్కరూ కృషి చేస్తూ క్రమం తప్పకుండా పొదుపు సంఘాల ద్వారా తీసుకున్న రుణాలను గ్రూప్ సభ్యులు సకాలంలో క్రమం తప్పకుండా చెల్లించాలని ఏపీఎం సూచించార. అదేవిధంగా నిరంతరం క్రమం తప్పకుండా గ్రామాల్లోని సంఘాలు సమావేశాలు నిర్వహించుకుంటూ పొదుపులు, అప్పులు సకాలంలో చెల్లించాలన్నారు. మహిళ సంఘాలు సామాజిక కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొని నిర్వహణ కార్యక్రమం చేపట్టాలన్నారు. తద్వారా సామాజిక, ఆర్ధిక అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. అనంతరం పలు అంశాలపై జెండర్ ప్రతిజ్ఞ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సెర్చ్ స్టేట్ రిసోర్స్ పర్సన్లు జ్యోతి, దీవెన, సీసీలు విజయలక్ష్మీ, సత్యనారాయణ, మండల సమాఖ్య అధ్యక్షురాలు సరస్వతి, సిబ్బంది పీత్రీ పాల్గొన్నారు..
Post Views: 559








