బిఆర్ఎస్ పార్టీ నూతన కార్యాలయాన్ని ప్రారంభించిన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు శ్రీ రేగా కాంతారావు
బట్టుపల్లి గ్రామ శాఖ అధ్యక్షులు కార్యదర్శులు కార్యకర్తలతో సమన్వయ సమావేశంలో పాల్గొని సమస్యలను అడిగి తెలుసుకోవడం జరిగింది
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం మండలం బట్టుపల్లి గ్రామంలో గ్రామ శాఖ అధ్యక్షుడు ముద్ధం సాంబయ్య గారి అధ్యక్షతన మండల అధ్యక్షులు రావు సోమయ్య గారి ఆధ్వర్యంలో నూతనంగా బిఆర్ఎస్ పార్టీ కార్యాలయం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు మాజీ శాసనసభ్యులు యంగ్ డైనమిక్ లీడర్,పినపాక అభివృద్ధి ప్రదాత శ్రీ రేగా కాంతారావు గారి చేతుల మీదుగా ప్రారంభించడం జరిగింది.ఈ సందర్భంగా శ్రీ కాంతారావు గారు మాట్లాడుతూ గ్రామంలో బిఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించుకోవడం శుభపరిణామం అని,బట్టుపల్లి బిఆర్ఎస్ పార్టీ నాయకులను అభినందించడం.ప్రతి ఒక్క నాయకులు,కార్యకర్తలు బేదాభిప్రాయాలు లేకుండా కలిసికట్టుగా పనిచేస్తూ పార్టీ బలోపేతానికి కృషి చేయాలని, అదేవిధంగా రాబోయేది బిఆర్ఎస్ ప్రభుత్వమేనని ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రజలు నమ్మే పరిస్థితి లేదని,మాయ మాటలు చెప్పి ఇచ్చిన హామీలను నెరవేర్చలేక చతికిలబడ్డ పార్టీ కాంగ్రెస్ పార్టీ అని,కెసిఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కరోనా టైం లో కూడా వడ్లు కొనుగోలు చేయడం జరిగిందని రైతుబంధు రైతుభీమా,పింఛన్ లు సకాలంలో అందించామని, ఇప్పుడున్న ఈ ప్రభుత్వం రైతుబంధు,రైతు బీమా పింఛన్లు సకాలంలో ఇవ్వకపోవడమే కాకుండా వడ్లు కూడా కొనే పరిస్థితి లేదని,పంట పండించిన రైతులను ఈ ప్రభుత్వం చాలా ఇబ్బందులకు గురి చేస్తున్నదని,అదేవిధంగా యూరియా కట్టలకు యాప్ అని తీసుకొచ్చి తెలంగాణలో యూరియా కష్టాలను తెచ్చిన ఈ కాంగ్రెస్ పార్టీని ప్రజలు తొందరలోనే బొంద పెట్టే రోజులు దగ్గర పడ్డాయని, కాంగ్రెస్ పార్టీకి ఆంధ్రప్రదేశ్లో,తమిళనాడులో పట్టిన గతే త్వరలో తెలంగాణలో కూడా తప్పక అదే గతి పడుతుంది అని,బిఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులు ఎవరు అధైర్య పడొద్దని వచ్చేది మన బిఆర్ఎస్ ప్రభుత్వమే అని ఈ సందర్భంగా తెలియజేసారు.ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు రావుల సోమయ్య గారు,అక్కిరెడ్డి వెంకటరెడ్డి గారు బైరిశెట్టి చిరంజీవి గారు,కొమరం రాంబాబు గారు, సర్పంచ్ బట్టలు సందీప్ గారు ఉప సర్పంచ్ బుడగం రాము గారు, ఉప్పల శ్రీధర్ గారు డైరెక్టర్ మొత్తం సతీష్ గారు ఉప్పల్ ఆదినారాయణ గారు కుంటి గొర్ల వెంకన్న గారు పిర్ర విష్ణు గారు ఎక్కడి భాస్కర్ గారు కొంచెం వీరన్న ఈ సంశంకర్ గారు నాగమణి గారు వార్డ్ మెంబర్స్ సూర మధుగారు పిట్టల లక్ష్మణ్ గారు గోని లింగయ్య గారు పోగు నారాయణ గారు ఓర్సు సత్యనారాయణ గారు సోషల్ మీడియా వారియర్స్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొనడం జరిగింది








