గోల్డెన్ న్యూస్/ కొమురం భీం ఆసిఫాబాద్ / విధులలో నిబంధనలు పాటించని పంచాయితీ కార్యదర్శిని సస్పెండ్ చేసినట్లు కొమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా కలెక్టర్ కె.హరిత తెలిపారు. జిల్లాలోని దహేగాం మండలం బిబ్రా గ్రామపంచాయతీలో సర్పంచ్, ఉప సర్పంచ్లు కార్యదర్శిపై చేసిన ఫిర్యాదు మేరకు జిల్లా కలెక్టర్ అదేశాల మేరకు చేసిన విచారణలో బిబ్రా పంచాయతీ కార్యదర్శి డి. సుమలత గ్రామపంచాయతీ తీర్మానం, సర్పంచ్, ఉపసర్పంచ్ ఆమోదం లేకుండా, రూ.1 లక్ష 2 వేల 297 రూపాయల నిధులను నిబంధనలకు విరుద్ధంగా డ్రా చేశారని, ఇతర చెల్లింపులలో నిబంధనలు పాటించలేదని తేలడంతో సదరు పంచాయతీ కార్యదర్శిని సస్పెండ్ చేయడం జరిగిందని తెలిపారు. గ్రామపంచాయతీలో నిధులు చెల్లింపు పారదర్శకంగా చేయాలని, నిబంధనలు అతిక్రమించినా, సంక్షేమ పథకాల అమలులో నిర్లక్ష్యం వహించినా కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.
Post Views: 44









