చెట్టును ఢీకొన్న ఆటో- ముగ్గురికి గాయాలు

గోల్డెన్ న్యూస్ / బూర్గంపాడు / మణుగూరు నుండి ఇరవెండి  మార్గంలో భద్రాచలం వెళ్తున్న ఆటో శనివారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. తాళ్లకొమ్మూరు క్రషర్ మిల్లు సమీపంలో వేగంగా వెళ్తున్న ఒక ఆటో అదుపుతప్పి రోడ్డు పక్కనే ఉన్న చెట్టును ఢీ ఢీకొంది. బలంగా ఢీకొట్టడంతో. ఈ ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న ముగ్గురు ప్రయాణికులు తీవ్రంగా గాయపడగా, ప్రస్తుతం వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. స్థానికు ఇచ్చిన సమాచారంతో  పోలీసులు  ఘటనా స్థలానికి చేరుకుని, క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. కరకగూడెం గ్రామానికి చెందిన ఆడెపు సతీష్ కుటుంబంగా గుర్తించారు. భద్రాచలం ఆస్పత్రికి వెళుతున్న వెళుతున్న క్రమంలో  ఈ ప్రమాదం జరిగింది . ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

Facebook
WhatsApp
Twitter
Telegram