సిపిఐ (ఎంఎల్)మాస్ లైన్ (ప్రజాపందా) జిల్లా కార్యదర్శి ముద్దా. బిక్షం,
టియుసిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కే. యాకూబ్ షావలి.
గోల్డెన్ న్యూస్ /మణుగూరు / కామ్రేడ్ మల్లెల. రామన్న ఆశయ సాధనకై పోరాడాలని సిపిఐ (ఎంఎల్)మాస్ లైన్ (ప్రజాపందా) జిల్లా కార్యదర్శి ముద్దా. బిక్షం,టియుసిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కే. యాకూబ్
షావలి అన్నారు. శనివారం కామ్రేడ్ రామన్న సంతాప సభ టియుసిఐ జిల్లా అధ్యక్షులు ఆర్. మధుసూదన్ రెడ్డి అధ్యక్షతన మణుగూరు లోని గుట్ట మల్లారంలో జరిగింది. ఈ సంతాప సభలో వారు పాల్గొని మాట్లాడారు.ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కామ్రేడ్ మల్లెల. రామన్న సిపిఐ (ఎంఎల్) మాస్ లైన్ (ప్రజాపందా), ట్రేడ్ యూనియన్ సెంటర్ ఆఫ్ ఇండియా (టి యు సి ఐ) కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటూ కార్మికుల, ప్రజా సమస్యల పరిష్కారం కోసం పనిచేశాడు అన్నారు. దోపిడీ, పీడనలు లేని సమ సమాజ స్థాపన కోసం కలలు కన్నాడు అన్నారు. మణుగూరు ప్రాంతంలో పార్టీ విస్తరణకు, ట్రేడ్ యూనియన్ విస్తరణకు కృషి చేస్తున్న క్రమంలో అకస్మాత్తుగా ప్రమాదవశాత్తు మరణించడం బాధాకరమన్నారు. కామ్రేడ్ రామన్న మృతి మణుగూరు ప్రాంత పార్టీకి, ట్రేడ్ యూనియన్ కి, విప్లవోద్యమానికి తీరని లోటు అన్నారు. కామ్రేడ్ రామన్న మృతి పట్ల సంతాపం వ్యక్తం చేస్తూ, వారి కుటుంబానికి తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.మణుగూరు ప్రాంతంలో పార్టీని, ట్రేడ్ యూనియన్ ను బలోపేతం చేసి బలమైన విప్లవోద్యమాన్ని నిర్మించడమే కామ్రేడ్ రామన్నకు ఇచ్చే ఘనమైన నివాళి అన్నారు. అందుకోసం పార్టీ, ట్రేడ్ యూనియన్ కార్యకర్తలు అందరూ కృషి చేయాలన్నారు. రామన్న ఆశయ సాధన కోసం పోరాడాలన్నారు.
ఈ సంతాప సభలో సిపిఐ (ఎంఎల్) ప్రజాపందా, ట్రేడ్ యూనియన్ సెంటర్ ఆఫ్ ఇండియా (టి యు సి ఐ) నాయకులు శెట్టిపల్లి. నాగేశ్వరరావు, కోళ్ల.వెంకటేశ్వర్లు, బత్తుల. వెంకటేశ్వర్లు, పి. సంజీవరెడ్డి, మిట్టపల్లి. రాజేందర్, జంపాల. యాకయ్య, ఎన్. రాజశేఖర్ రెడ్డి, జల్లా అశోక్, సాంబ, యాకూబ్, సమ్మన్న, సతీష్, రాజ్ కుమార్, అయోధ్య, వి. జానయ్య, ఆర్. వెంకటేశ్వర్లు, యాలాద్రి, లక్ష్మణ్, సత్యనారాయణ, నిర్మల, రావులపల్లి. ప్రభాకర్, తిరుపతి, మరియు కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.








