గోల్డెన్ న్యూస్ / తెలంగాణ /రాష్ట్రంలో గత రెండు,మూడు రోజులుగా ఉష్ణోగ్రతలు భారీగా పెరిగిపోవడంతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు.భానుడి భగభగలకు కొన్ని ప్రాంతాలలో వడదెబ్బలు తగిలి జనాలు మరణిస్తున్న విషయం తెలిసిందే . మనుషులే కాకుండా పశువులు, పక్షులు( Livestock , birds ) కూడా ఎండ తీవ్రతకు ప్రాణాలు కోల్పోవడం కలచి వేస్తుంది,శనివారం మెదక్ జిల్లా తూప్రాన్ లో మండే ఎండలకు ఓ రైతుకు సంబంధించిన ఎద్దు మరణించింది.అలాగే కరీంనగర్ జిల్లా హుజరాబాద్ మండలం పరిధిలోని బోర్నపల్లి శివారులో శుక్రవారం మధ్యాహ్నం ఎండ తీవ్రతను తట్టుకోలేక రామచిలుకలు రోడ్డుపైనే సొమ్మసిల్లి పడిపోయి ప్రాణాలు కోల్పోయింది
Post Views: 337








