పెరిగిన పెట్రోల్ డీజిల్ రేట్లు తగ్గించాలని సిపిఎం పార్టీ ఆందోళన

పెరుగుతున్న పెట్రోల్ డీజిల్ రేట్లు వెంటనే తగ్గించాలని సిపిఎం పార్టీ బూర్గంపాడు మండల కమిటీ డిమాండ్ 

 

గోల్డెన్ న్యూస్  /బూర్గంపాడు / సారపాక బస్టాండ్ సెంటర్లో పెట్రోల్ డీజిల్ రేట్లు తగ్గించాలని నిరసన ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బాల నర్సారెడ్డి పాల్గొని మాట్లాడుతూ కేంద్రంలో బిజెపి ప్రభుత్వం విచ్చలవిడిగా రెచ్చిపోయి ప్రజల పైన భారాలు మోపుతున్నారని అన్నారు

 

అంతేకాదు ప్రజల్ని మతాల పేరుతో కులాల పేరుతో పక్కదారి పట్టిస్తూ మోడీ ప్రభుత్వం ఇష్ట రాజ్యాంగ ధరలు పెంచుతున్నారని ప్రజలకి ధరలు పెరుగుతున్న కూడా ప్రభుత్వంపై దృష్టి లేకుండా పక్కదారి పట్టిస్తున్న మోడీ ప్రభుత్వం

అందుకు ఇవ్వాలా దేశవ్యాప్తంగా సామాన్య ప్రజలు నిత్యవసర సరుకులు కొనుక్కొని తినలేని చితికి తెచ్చిన మోడీ

పెట్రోల్ డీజిల్ గ్యాస్ రేట్లు పై ధరలు పెంచితే సామాన్యుడు కొనుక్కొని తినలేని దౌర్భాగ్యానికి తీసుకొస్తున్న మోడీ ప్రభుత్వం ఉప్పు దగ్గర నుండి పప్పు మంచి నూనె ఇతర ప్రజలు ఉపయోగపడే నిత్యవసర సరుకులపై భారాలు మోపుతున్న కార్పొరేట్ శక్తులు దేశంలో ఉన్న సంపద మొత్తం అదాని అంబనీకే కట్టపేడుతున్నారని తెలిపారు

సిపిఎం పార్టీ మండల కార్యదర్శి బత్తుల వెంకటేశ్వర్లు మాట్లాడుతూ మోడీ ప్రభుత్వం 2014లో అధికారంలోకి వచ్చిన కానుంచి ప్రజలు అనేక ఇబ్బందులకు గురవుతున్నారు నిరుద్యోగం బజారున పడుతున్నారు చదువుకున్న విద్యార్థులు అనేకమైన తప్పుడు మార్గాలలో నడుస్తున్నారు ఉద్యోగాలు లేక చదువుకున్న విద్యార్థులకు రెండు కోట్లు ఉద్యోగాలు ఇస్తానని మభ్యపెట్టి అధికారంలోకి వస్తున్న మోడీ కానీ ఎక్కడ ఉద్యోగాలు ఇవ్వలేదు అందుకు

ప్రభుత్వానికి యువత బుద్ధి చెప్పాలని గుణపాఠం చెప్పాల్సిన అవసరం ఉందని మోటార్ సైకిల్ వెహికల్స్ కూడా నడపలేని పరిస్థితిలో ఇవాళ పెట్రోల్ డీజిల్ విపరీతంగా రేట్లు పెంచుతున్నారు మోడీ ప్రభుత్వం ఐదు రాష్ట్రాలు ఎన్నికలు అయిన వెంటనే ఇప్పటికీ పది రోజుల్లో నాలుగుసార్లు పెట్రోల్ డీజిల్ పెంచి పది రూపాయల దాకా పెంచారు ఇప్పుడు సుమారు ఒక లీటరు పెట్రోలు 117కు పెరిగింది అంటే 60 రూపాయలు పెట్రోలు ఉన్న గతంలో ఈ రోజున ఇంత పెద్ద ఎత్తున ధరలు పెంచడం దారుణమైన విషయమని అన్నారు గత వారం రోజుల్లో క్రూడ్ ఆయిల్ ధర 110 డాలర్ల నుంచి 92 డాలర్ల కంటే కిందుకు పడిపోయింది కానీ మనకు మాత్రం నాలుగుసార్లు పెట్రోల్ డీజిల్ ధరలు పెంచారు ఎందుకిలా జరుగుతుంది అంటే ఈ దేశంలో సామాన్యుడు బతికే పరిస్థితి లేకుండా ధరల మీద ధరలు పెంచుతున్న మోడీ ప్రభుత్వానికి ప్రజలు అర్థం చేసుకోవాలి ఈ యొక్క పెంపుదల ఇంతటితో ఆగదు రోజు రోజు పెరుగుతూనే ఉంటది కాబట్టి ప్రజలందరూ కూడా పోరాటాలు ఉద్యమంలోకి రావాలని డిమాండ్ చేశారు

ఈ కార్యక్రమంలో మండల కమిటీ సభ్యులు పాపినేని సరోజన,

Sk అబిద, భయ్యా రాము, గుంటుక కృష్ణ ,పాండవుల రామనాథం, కనకం వెంకటేష్, రాంబాబు తదితరులు పాల్గొన్నారు

Recent News :

MOHAMMED RAFEE

MOHAMMED RAFEE

GOLDEN NEWS EDITOR & CHAIRMAN

Admin

Golden News

Facebook
WhatsApp
Twitter
Telegram