పెంచిన పెట్రోల్, డీజిల్ ధరలను వెంటనే తగ్గించాలి.

పెంచిన పెట్రోల్, డీజిల్ ధరలను వెంటనే తగ్గించాలి.

 

గోల్డెన్ న్యూస్ /మణుగూరు / సిపిఐ (ఎంఎల్) మాస్ లైన్ (ప్రజాపంథా) మణుగూరు డివిజన్ కార్యదర్శి ఆర్. మధుసూదన్ రెడ్డి.

 

పెంచిన పెట్రోల్, డీజిల్ ధరలను వెంటనే తగ్గించాలని సిపిఐ (ఎంఎల్) మాస్ లైన్ (ప్రజాపంథా) మణుగూరు డివిజన్ కార్యదర్శి ఆర్. మధుసూదన్ రెడ్డి కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పెంచిన పెట్రోల్, డీజిల్ ధరలకు నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు నిర్వహించాలని పార్టీ రాష్ట్ర కమిటీ ఇచ్చిన పిలుపులో భాగంగా మణుగూరు లో నిరసన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ నిరసన కార్యక్రమంలో వారు పాల్గొని మాట్లాడారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మే 15 నుంచి మే 25 వరకు 10 రోజుల వ్యవధిలో నాలుగు సార్లు పెట్రోల్, డీజిల్ ధరలను కేంద్ర ప్రభుత్వం పెంచిందన్నారు.4 విడతలుగా పెట్రోల్ పై 7 రూపాయల 38 పైసలు, డిజిల్ పై 7 రూపాయల 52 పైసలు పెంచి పేద, మధ్యతరగతి ప్రజల పై మోయలేని భారాలు మోపిందన్నారు. పెట్రోల్, డీజిల్ ధరలు పెరగడం వలన రవాణా చార్జీలు పెరిగి నిత్యావసర సరుకుల ధరలు, ఇతర ధరలు పెరిగి సామాన్యులు జీవించలేని పరిస్థితి ఏర్పడుతుందన్నారు. పెంచిన పెట్రోల్, డీజిల్ ధరలను వెంటనే తగ్గించాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో నాయకులు జెల్లా అశోక్, ఆకుల. సత్యనారాయణ, పి. సంజీవరెడ్డి, వంశీకృష్ణ, సతీష్ బాబు, జంపయ్య, సుధాకర్, పివి శ్రీనివాస్, చెట్టుపల్లి. నాగేశ్వరరావు, తిరుపతి, తదితరులు పాల్గొన్నారు.

Facebook
WhatsApp
Twitter
Telegram