పెరటి కోళ్ల పెంపకానికి రూ.5.50 లక్షల నిధుల పంపిణీ
గోల్డెన్ న్యూస్/ కరకగూడెం /ప్రజాపాలన–ప్రగతి ప్రణాళికలో భాగంగా మహిళా వారోత్సవాలు నిర్వహిస్తున్న సందర్భంగా కరకగూడెం మండలంలోని స్వయం శక్తి మండల మహిళా సమాఖ్య పరిధిలోని 27 గ్రామ సమాఖ్యలకు చెందిన 275 మంది సంఘ సభ్యులకు పెరటి కోళ్ల పెంపకం కోసం మొత్తం రూ.5.50 లక్షల నిధులను మంజూరు చేశారు.
ఈ సందర్భంగా నిధులకు సంబంధించిన చెక్కులను స్థానిక తెలంగాణ గ్రామీణ బ్యాంకులో లబ్ధిదారులకు పంపిణీ చేశారు. మహిళల ఆర్థికాభివృద్ధికి తోడ్పడే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు అధికారులు తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఏపీఎం బండి వినోద్ క్రాంతి, తెలంగాణ గ్రామీణ బ్యాంకు బ్రాంచ్ మేనేజర్ ఎన్. గిరిబాబు, సీసీలు పోలేబోయిన విజయలక్ష్మి, సత్యనారాయణ, అకౌంటెంట్ ప్రీతి, సమాఖ్య ప్రతినిధి మహేశ్వరి తదితరులు పాల్గొన్నారు.
Post Views: 738








