జగిత్యాలలో విషాదం! బావిలో పడ్డ కారు

 

 

ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్‌ను ఫోన్‌లో చూస్తూ డ్రైవింగ్ చేస్తున్న సమయంలో థార్ వాహనం రోడ్డు పక్కనున్న బావిలోకి దూసుకెళ్లింది.

 

జగిత్యాల రూరల్ మండలం మోరపెల్లిలో జరిగిన ఈ ఘటనలో నివేష్, అశ్విన్‌ను స్థానికులు సురక్షితంగా రక్షించగా, వాహనం నడుపుతున్న అరుణ్ బావిలో మునిగి మృతి చెందాడు.

 

పోలీసులు, రెస్క్యూ సిబ్బంది రెండు గంటల పాటు సహాయక చర్యలు చేపట్టి మృతదేహాన్ని వెలికితీశారు.

Facebook
WhatsApp
Twitter
Telegram