గోల్డెన్ న్యూస్/ బీర్కూర్/ బీర్కూరు మండలం ఇందిర కాలనికి చెందిన బాస పెద్ద సాయిలు విద్యుదాఘాతంతో మృతి చెందాడు. స్థానికుల కథనం ప్రకారం.. ఇంట్లో వేలాడుతున్న విద్యుత్ తీగ తగిలి ఆకస్మికంగా కరెంట్ షాకు కు గురై మృతి చెందాడు. దీంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుయ్యారు. ఘటన స్థలానికి చేరుకున్న సర్పంచ్, పోలీసులు, శవాన్ని పోస్టుమార్టం నిమిత్తం బాన్సువాడ ఏరియా ఆసుపత్రికి తరలించారు. మృతునికి భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు.
Post Views: 574








