టీటీడీకి ట్రక్కు విరాళం

గోల్డెన్ న్యూస్ / ఆంధ్రప్రదేశ్ /ప్రముఖ వాహన తయారీ సంస్థ అశోక్ లేలాండ్ లిమిటెడ్ శనివారం టీటీడీకి రూ.31,72,532 విలువైన ట్రక్కును విరాళంగా అందించింది.

 

ఈ మేరకు ఆ సంస్థ ప్రెసిడెంట్ శ్రీ సంజీవ్ కుమార్ శ్రీవారి ఆలయం ముందు వాహనానికి ప్రత్యేక పూజలు నిర్వహించి టీటీడీ అదనపు ఈవో శ్రీ సి.హెచ్.వెంకయ్య చౌదరికి ట్రక్కు తాళాలను అందజేశారు.

 

ఈ కార్యక్రమంలో టీటీడీ ట్రాన్స్ పోర్ట్ ఇన్ చార్జ్ జీఎం శ్రీమతి లక్ష్మీ ప్రసన్న, తిరుమల డీఐ శ్రీ కృష్ణయ్య పాల్గొన్నారు.

Facebook
WhatsApp
Twitter
Telegram