పంచాయతీ కార్మికులకు జీవో నెంబర్ 6, లేదా జీవో 60, ప్రకారం కేటగిరీల వారీగా వేతనాలు చెల్లించాలి,

గ్రామపంచాయతీ కార్మికులకు జీవో నెంబర్ 6 ప్రకారం లేదా జీవో నెంబర్ 60 ప్రకారం కేటగిరీల వారీగా వేతనాలు చెల్లించాలి,

గ్రామపంచాయతీ కార్మికులకు పీఎఫ్, ఈఎస్ఐ, ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలి,

 పెరుగుతున్న జనాభా కనుగుణంగా కార్మికుల సంఖ్యను పెంచి పని భారం తగ్గించాలి.

గ్రామపంచాయతీ కార్మికుల పెండింగ్ వేతనాలు వెంటనే చెల్లించాలి.

ట్రేడ్ యూనియన్ సెంటర్ ఆఫ్ ఇండియా (టి యు సి ఐ) జిల్లా అధ్యక్షులు ఆర్. మధుసూదన్ రెడ్డి.

 

గోల్డెన్ న్యూస్ /పినపాక / గ్రామపంచాయతీ కార్మికులకు జీవో నెంబర్ 6 ప్రకారం లేదా జీవో నెంబర్ 60 ప్రకారం కేటగిరీల వారీగా వేతనాలు చెల్లించాలని, పీఎఫ్, ఈఎస్ఐ ,ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలని, పెరుగుతున్న జనాభా కనుగుణంగా కార్మికుల సంఖ్యను పెంచి పని భారం తగ్గించాలని, గ్రామపంచాయతీ కార్మికుల పెండింగ్ వేతనాలు చెల్లించాలని, ప్రతి నెల ఒకటో తారీఖున వేతనాలు చెల్లించాలని ట్రేడ్ యూనియన్ సెంటర్ ఆఫ్ ఇండియా (టి యు సి ఐ) జిల్లా అధ్యక్షులు ఆర్. మధుసూదన్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ ప్రగతిశీల గ్రామపంచాయతీ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర కమిటీ ఇచ్చిన పిలుపులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఆందోళనలో భాగంగా ఈరోజు పినపాక ఎంపీడీవో కార్యాలయం ముందు ధర్నా నిర్వహించి ఎంపీడీవో కు ఎంపీవోకు వినతిపత్రాలు అందజేశారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 12,732 గ్రామపంచాయతీలో పనిచేస్తున్న 54,200 ఆన్లైన్లో నమోదైన వారితోపాటు మరో 6000 మంది నమోదు కాని వర్కర్స్ గ్రామపంచాయతీలో పనిచేస్తున్నారని, రాష్ట్రంలో ఉన్న 73 షెడ్యూల్ జీవోలను రద్దు చేస్తూ, మూడు జోన్లుగా చేస్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి కొత్త వేతనాలను పెంపుదల ప్రకటించారని, ఈ వేతనాల పెంపుదల జీవో 6 ను విడుదల చేస్తూ గెజిట్ ముద్రించారని, రాష్ట్రానికి పేరు ప్రతిష్టలు తెస్తున్న వేలాది మంది గ్రామపంచాయతీ వర్కర్ల ను కాంట్రాక్టు, అవుట్సోర్సింగ్ వర్కర్స్ గా గుర్తించి జీవో నెంబర్ 6 ప్రకారం పెంచిన వేతనాలను గ్రామపంచాయతీ కార్మికులకు వర్తింపజేయాలని డిమాండ్ చేశారు.మా పరిధిలో ఉన్న సమస్యలను వెంటనేపరిష్కరిస్తామని ఎంపీడీవో, ఎంపీవోగారు హామీ ఇచ్చారని తెలిపారు.

ఈ కార్యక్రమంలో కొమరం. లక్ష్మయ్య, పి.సారయ్య, నామా. వెంకన్న, మేకల. మౌనిక, వల్లెపు.సంపత్, ఊడుగుల. వెంకటేష్, కోరం. సమ్మయ్య, సాధన పల్లి. రమేష్, తోకల.నరసయ్య ,గుంటక. రామారావు, కొమరం. వెంకటనారాయణ, పూణేం. మధు, బుడుగుల. శ్రీను,p. నాగరాజు, రామకృష్ణ, నవాతు. రాము, దుర్గం. పీరయ్య, సమ్మయ్య, లక్ష్మయ్య తదితరులు పాల్గొన్నారు.

Facebook
WhatsApp
Twitter
Telegram