వయనాడ్‌లో విరిగిపడిన కొండచరియలు.. చిక్కుకున్న పలువురు
కేరళలోని వయనాడ్‌లో మరోసారి కొండచరియలు బీభత్సం సృష్టించాయి. సోమవారం రాత్రి నుంచి కురుస్తున్న భారీ వర్షాలకు అనక్కంపొయిల్-కల్లాడి సొరంగం నిర్మాణ స్థలం వద్ద కొండచరియలు విరిగిపడ్డాయి.
కేరళలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. వయనాడ్, కోళికోడ్‌లో రెడ్ అలర్ట్ ప్రకటించారు
కన్నూర్, కాసరగోడ్ జిల్లాల్లో ఆరెంజ్ అలర్ట్.. ఇడుక్కి, త్రిసూర్, పాలక్కాడ్ జిల్లాల్లో ఎల్లో అలర్ట్ కొనసాగుతోంది
వయనాడ్‌లో కొండచరియలు విరిగిపడి ఇద్దరు వ్యక్తులు దుర్మరణంపాలయ్యారు. మరో ఆరుగురు గల్లంతయ్యారు. ఇంకో ఆరుగురు క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. వయనాడ్ రెస్క్యూ ఆపరేషన్‌లో పాల్గొన్న మెప్పాడి ఎస్సైకి తీవ్ర గాయాలయ్యాయి
Post Views: 15








