అనంతారం జిల్లా పరిషత్ పాఠశాలలో ఫిజిక్స్ టీచర్ను నియమించాలని విద్యార్థుల ఆందోళన
గోల్డెన్ న్యూస్/ కరకగూడెం / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కర్రగూడెం మండలం అనంతారం గ్రామంలోని జిల్లా పరిషత్ పాఠశాలలో గత సంవత్సరం నుండి ఫిజిక్స్ టీచర్ లేకపోవడంతో విద్యార్థులు సోమవారం పాఠశాలలో ఆందోళన చేపట్టారు. ఫిజిక్స్ బోధన సక్రమంగా జరగకపోవడంతో తమ చదువులు దెబ్బతింటున్నాయని వారు ఆవేదన వ్యక్తం చేశారు.ముఖ్యంగా 10 తరగతి, 9వ తరగతి, 8వ తరగతి విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. పాఠశాలలు ప్రారంభమై రెండు నెలలు గడుస్తున్నప్పటికీ ఫిజిక్స్ టీచర్ను నియమించ లేదు. ఇలా ఉంటే విద్యార్థులు చదువులు ఎలా కొనసాగుతాయని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఫిజిక్స్ టీచర్ను వెంటనే నియమించాలని వారు డిమాండ్ చేశారు. పాఠశాల ఆవరణలో నినాదాలు చేస్తూ నిరసన వ్యక్తం చేశారు. ఉన్నతాధికారులు స్పందించి త్వరితగతిన టీచర్ను నియమించి విద్యార్థుల భవిష్యత్తును కాపాడాలని కోరారు.

ఫిజిక్స్ టీచర్ లేని మాట వాస్తవమే. ప్రధానోపాధ్యాయులు వసంతరావు
ఫిజిక్స్ టీచర్ లోటు ఉన్నమాట వాస్తవమే ప్రధానోపాధ్యాయులు చుట్టుబాక వసంతరావు ఈ విషయం ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి విద్యార్థుల సమస్యను పరిష్కరించే విధంగా కృషి చేస్తాను ..

Post Views: 1,122









