మృతుడి కుటుంబానికి బిఆర్ఎస్ నేతల ఆర్థిక సాయం

గోల్డ్ న్యూస్ / కరకగూడెం/ మండలంలోని వెంకటాపురం గ్రామపంచాయతీకి చెందిన కొమరం రాంగోపాల్ ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో  మృతి చెందాడు. దశదిన కర్మల సందర్భంగా బుధవారం బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో మృతుడి కుటుంబానికి ఆర్థిక సాయం అందించారు.50 కేజీల బియ్యం, నిత్యవసరాలు కూడా అందజేశారు. కార్యక్రమంలో మండల బిఆర్ఎస్ మండల అధ్యక్షులు రావుల సోమయ్య. సమత్ బట్టుపల్లి సర్పంచ్ కొమరం సత్యనారాయణ, వట్టం వారి గుంపు సర్పంచ్ సందీప్, కరకగూడెం ఉపసర్పంచ్ బుడగం రాము గ్రామస్తులు వెంకటేశ్వర్లు, లింగయ్య, దిలీప్, నాగభూషణం, చంద్ర శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.

Facebook
WhatsApp
Twitter
Telegram