విషాదం : ఒకే కుటుంబంలో ఐదుగురు మృతి

 విషాదం.ఒకే కుటుంబంలో ఐదుగురు మృతి

 

బత్తలపల్లి :  శ్రీశైలంలో విషాద ఘటన చోటు చేసుకుంది. శ్రీశైలం వడ్డెర అన్నదాన సత్రంలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు ఊరివేసుకొని ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపుతోంది. గత 3 రోజులుగా రూమ్‌ నుంచి బయటకు రాకపోవడంతో పాటు దుర్వాసన రావడంతో అనుమానం వచ్చిన సత్రం నిర్వాహకులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. దీంతో పోలీసులు అక్కడకు చేరుకుని తలుపులు తెరచి చూడగా బాత్రూమ్‌లో ముగ్గురు మహిళలు, ఫ్యాన్‌కు ఇద్దరు పురుషులు ఉరివేసుకొని కనిపించారు. మృతులు సుధాకర్(36), గోగుల ఆదిలక్ష్మి(50), మల్లేశ్వరి(45), శ్రీదేవి(33), మణికంఠ(15)గా గుర్తించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఆర్థిక ఇబ్బందులే ఆత్మహత్యకు కారణంగా పోలీసులు భావిస్తున్నారు.

 

 

 

Facebook
WhatsApp
Twitter
Telegram