పోలీస్ జాబ్ కు ప్రిపేర్ అయ్యే వారికి గుడ్ న్యూస్

కరకగూడెం : పోలీసు ఉద్యోగాల కోసం సన్నద్ధమవుతున్న అభ్యర్థులకు పోలీసు శాఖ శుభవార్త చెప్పింది. పోలీస్ కాన్స్టేబుల్, ఎస్ఐ ఉద్యోగ రిక్రూట్‌మెంట్ పరీక్షలకు ప్రిపేర్ అయ్యే యువతకు ఎంతో ఉపయోగపడేలా ప్రత్యేక ఉచిత కోచింగ్ కల్పించనుంది. కరకగూడెం మండలంలోని చదువుకున్న యువతి యువకులు పోలీస్ జాబ్ కొరకు ప్రయత్నిస్తున్నట్లయితే అట్టి యువతీ యువకుల నుండి పోలీసు వారు ఉచిత కోచింగ్ కి దరఖాస్తుల్ని ఆహ్వానించడం జరుగుతుంది . ఎవరైనా ఆసక్తిగల అభ్యర్థులు తమ యొక్క పూర్తి వివరాలతో పోలీస్ స్టేషన్ ని సంప్రదించి మీ వివరాలు నమోదు చేసుకొని ఈ ఉచిత కోచింగ్ ని సద్వినియోగం చేసుకోవాలని ఎస్సై పివీ నాగేశ్వరరావు తెలిపారు

 దరఖాస్తులకు చివరి తేదీ 30:08:2026

పరీక్ష నిర్వహణ తేదీ 06:09:2026

Facebook
WhatsApp
Twitter
Telegram