హైవే సమీపంలో రెండు గుర్తుతెలియని మృతదేహాల కలకలం

సూర్యాపేట–ఖమ్మం రహదారి సమీపంలో కలకలం.. పాతిపెట్టిన ఆడ, మగ మృతదేహాలు వెలుగులోకి

 

గోల్డెన్ న్యూస్/సూర్యాపేట / మోతె మండల కేంద్రానికి సమీపంలో తీవ్ర కలకలం చోటుచేసుకుంది. సూర్యాపేట–ఖమ్మం జాతీయ రహదారికి సుమారు అర కిలోమీటరు దూరంలో రెండు గుర్తుతెలియని మృతదేహాలను పాతిపెట్టిన స్థితిలో స్థానిక రైతులు గుర్తించారు.

 

వెంటనే పోలీసులకు సమాచారం అందించడంతో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. డాగ్ స్క్వాడ్, క్లూస్ టీంతో ఆధారాలను సేకరిస్తూ దర్యాప్తు చేపట్టారు.

 

సంఘటనా స్థలానికి జిల్లా ఎస్పీ, డీఎస్పీతో పాటు పోలీసు అధికారులు చేరుకుని పరిశీలించారు. అక్కడ రక్తపు మరకలు, చెప్పులు తదితర ఆనవాళ్లు గుర్తించినట్లు సమాచారం. పాతిపెట్టిన మృతదేహాల్లో ఒకటి మహిళకు, మరొకటి పురుషుడికి చెందినవిగా పోలీసులు ప్రాథమికంగా గుర్తించినట్లు సమాచారం.

 

మృతులు ఎవరు? వారిని అక్కడికి తీసుకొచ్చి పాతిపెట్టింది ఎవరు? అనే కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు పోలీసుల విచారణ అనంతరం వెల్లడయ్యే అవకాశం ఉంది.

 

 

Facebook
WhatsApp
Twitter
Telegram