గొడ్డళ్లతో దాడి చేసి వ్యక్తిని హతమార్చిన ఇద్దరు
గోల్డెన్ న్యూస్ / మంగపేట/ ములుగు జిల్లా మంగపేట మండలంలో దారుణ హత్య ఘటన చోటుచేసుకుంది. కమలాపురం గ్రామ శివారులో బుధవారం రాత్రి ఓ వ్యక్తిపై ఇద్దరు వ్యక్తులు గొడ్డళ్లతో దాడి చేసి అత్యంత దారుణంగా హత్య చేసినట్లు సమాచారం.
స్థానికుల సమాచారం ప్రకారం.. రాత్రి సుమారు 11 గంటల సమయంలో కమలాపురం గ్రామ శివారులో ఈ ఘటన చోటుచేసుకుంది. ఇద్దరు వ్యక్తులు కలిసి బాధితుడిపై గొడ్డళ్లతో దాడి చేయడంతో తీవ్రంగా గాయపడిన అతడు అక్కడికక్కడే మృతిచెందినట్లు తెలుస్తోంది.
ఘటనతో కమలాపురం గ్రామంలో భయాందోళన నెలకొంది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. హత్యకు గల కారణాలు, మృతుడి వివరాలు, నిందితుల గురించి పోలీసులు ఆరా తీస్తున్నారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు సమాచారం.
Post Views: 12









