వరి పొలంలో డ్రోన్తో మందు పిచికారీ
గోల్డెన్ న్యూస్ /కరకగూడెం / వ్యవసాయం రంగంలో వస్తున్న ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని రైతాంగం సద్వినియోగం చేసుకునేలా పల్లెల్లో డ్రోన్ సాంకేతిక అందుబాటులోకి వచ్చింది. మండలానికి చెందిన కాంగ్రెస్ నేత సయ్యద్ ఇక్బాల్ తన పొలంలో డ్రోన్ సాయంతో పురుగుమందు డ్రోన్ల ద్వారా పంటలపై పిచికారీపై చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆధునిక సాంకేతికతతో తక్కువ సమయంలో ఎక్కువ విస్తీర్ణంలో మందును పిచికారి చేయొచ్చని, దీంతో సమయం, కూలీల ఖర్చు ఆదా అవుతుందని పేర్కొన్నారు. రైతులు అందరూ డ్రోన్ పిచికారీ విధానాన్ని వినియోగించుకోవడం వల్ల సమయం, డబ్బు ఆదా అవుతుందని సూచించారు. వ్యవసాయంలో సాంకేతిక పరిజ్ఞానాన్ని రైతు సద్వినియోగం చేసుకోవాలన్నారు.
Post Views: 598









